వరలక్ష్మి హత్య కేసులో ప్రాథమిక విచారణ పూర్తి

వరలక్ష్మి హత్య కేసులో ప్రాథమిక విచారణ పూర్తి
X

విశాఖలో వరలక్ష్మి హత్య కేసులో ప్రాథమిక విచారణ పూర్తి చేశారు పోలీసులు. వరలక్ష్మిని.. అఖిల్‌ సాయి బ్లేడ్‌తో గొంతు కోసి చంపినట్లు నిర్ధారించారు. ప్రేమపేరుతో అఖిల్‌సాయి.. వరలక్ష్మిని కొన్నాళ్లుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. రాముతో చనువుగా ఉంటోందని వరలక్ష్మీపై కోపం పెంచుకున్న అఖిల్‌ సాయి.. సాయిబాబగుడి దగ్గర రాముతో మాట్లాడుతుండగా.. బ్లేడ్‌తో దాడి చేసినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు. ఈ కేసుపై వారం రోజుల్లో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని తెలిపారు. అటు వరలక్ష్మి మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు.

అఖిల్‌ సాయి... గతంలోనే... వరలక్ష్మిని వేధించినట్లు తెలిపారు వరలక్ష్మి తండ్రి. అప్పట్లోనే అతన్ని మందలించినట్లు తెలిపారాయన. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయిన అఖిల్‌... ఇప్పుడు రాక్షసుడిలా ఎందుకు మారాడో అర్థం కావడం లేదన్నారు. మెహందీ కోసం బయటికి వెళ్లిన తన కూతురు విగతజీవిగా వచ్చిందంటూ.. కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Next Story

RELATED STORIES