ఒకటి చెప్పి మరొకటి చేసి.. : రాజ్ కుంద్రాపై నటి ఫిర్యాదు

రాజ్ కుంద్రా తన యాప్‌లో పోర్న్ కంటెంట్‌ను క్రియేట్ చేసి, ప్రచురించిన కారణంగా ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఒకటి చెప్పి మరొకటి చేసి.. : రాజ్ కుంద్రాపై నటి ఫిర్యాదు
X

అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ మరొక నటి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె మాల్వాని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆమెతో కేవలం సన్నిహిత సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, ప్రైవేట్ పార్ట్‌లు చూపించడంలేదని రాజ్ కుంద్రా టీమ్ తనకు చెప్పారని బాధితురాలు ఆరోపించింది. అలా అనుకునే తాను వీడియో చిత్రీకరణ ఒప్పందంపై సంతకం చేశానని పేర్కొంది.

ఇందుకుగాను ఆమెకు కొన్ని వేల రూపాయలు చెల్లించినట్లు పేర్కొంది. అయితే, కొన్ని రోజుల తర్వాత తన స్నేహితుడి ద్వారా తన అశ్లీల వీడియో యాప్‌లో అందుబాటులో ఉందని తెలుసుకుని చింతించానని తెలిపింది. చిత్రీకరించిన మొత్తం వీడియో ఎలాంటి ఎడిటింగ్ చేయకుండానే అప్‌లోడ్ చేయబడిందని, తన ప్రైవేట్ పార్ట్‌లు కూడా వీడియోలో చూపబడ్డాయని తెలుసుకుంది.

మరోవైపు, కుంద్రా బ్యాంక్ ఖాతాలు, ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయనే విషయాన్ని కూడా కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాప్ రెవెన్యూ నుండి కుంద్రా లేదా శిల్పా శెట్టి వ్యక్తిగత ఖాతాకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని తెలుసుకున్నారు. కానీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

రాజ్‌ను జూలై 19 న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను జైల్లో ఉండి 15 రోజులకు పైగా అయింది.

Next Story

RELATED STORIES