విశాఖలో వరలక్ష్మి హత్య కేసులో మరో ఇద్దరు యువకులు అరెస్టు

విశాఖలో వరలక్ష్మి హత్య కేసులో మరో ఇద్దరు యువకులు అరెస్టు
X

విశాఖలో వరలక్ష్మి హత్య కేసు దర్యాప్తు ముమ్మరమైంది. కేసులో ప్రధాన నిందితుడు అఖిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మరో ఇద్దరు యువకుల్ని గాజువాకలో అరెస్టు చేశారు. రాము అనే యువకుడిని బెదిరించినందుకు గాను..వీరిని అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఒకరైన హరిరామకృష్ణంరాజు.. గతంలో హత్యకు గురైన రౌడీ షీటర్‌ గేదెల రాజు కుమారుడు అని పోలీసులు గుర్తించారు. గాజువాకకు చెందిన అప్పన్నను పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో అక్టోబర్‌ 31న ఇంటర్‌ యువతి వరలక్ష్మిని అఖిల్‌ అనే యువకుడు గొంతుకోసి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణానికి పాల్పడిన యువకుడు అఖిల్‌ను పోలీసులు అదే రోజు అరెస్ట్‌ చేశారు. వరలక్ష్మితో చనువుగా ఉంటున్నాడనే కారణంతో ఆమె సోదరుడు రాము అనే వ్యక్తితో గొడవపడ్డాడు. మరోసారి తన చెల్లెలతో మాట్లాడినట్టు తెలిస్తే బాగుండదని హెచ్చరించాడు. ఈ విషయాన్ని హరిరామకృష్ణరాజుతో చెప్పాడు.

రాముకు ఫోన్‌ చేసి షీలానగర్‌ వచ్చి తనను కలవాలని, లేదంటే ఇబ్బంది పడతావని హరిరామ కృష్ణంరాజు హెచ్చరించాడు. అతడిని కలిసిన రాము నుంచి 10వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇస్తే ఎవరి నుంచీ ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పగా... అతడికి 7వేల రూపాయలు ఇచ్చాడు. హరి స్నేహితుడు అప్పన్నకు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చాడు. వరలక్ష్మి హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు.. రాము ఈ విషయాలు చెప్పడంతో.. హరి, అప్పన్నను గాజువాక పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story

RELATED STORIES