TMC MLA's wife: ఎమ్మెల్యే భార్య అని కూడా చూడకుండా దొంగలు..

TMC MLA's wife: టిఎంసి ఎమ్మెల్యే , రాజ్యసభ మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ గుప్తా భార్య నగలు, డబ్బుని దొంగలు దోచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్‌లో ఒక ముఠా ఆమె బ్యాగ్‌ను దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలు కనికా గుప్తా ప్రస్తుతం లోధి కాలనీలోని ఒక ఇంటిలో నివసిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ (సౌత్ ఈస్ట్) ఆర్‌పి మీనా తెలిపారు. డిఫెన్స్ కాలనీ ఫ్లైఓవర్‌లో ఆమె తన డ్రైవర్‌తో కలిసి కారులో వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి వారి వాహనాన్ని అడ్డగించాడు. మీ కారు టైరుకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు.
దీంతో డ్రైవర్ టైరులో ఏదో సమస్య ఉందని భావించి కారు ఆపాడు. అనంతరం బైక్‌పై వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు కారు బోనోట్ చూపించారు. డ్రైవర్ కారు బోనోట్ దగ్గరకు వెళ్లి పరిశీలిస్తున్నాడు. ఈ లోపు ఎమ్మెల్యే భార్య కారులో వేడిగా ఉందని బయటకు వచ్చి నిలబడ్డారు. ఇదే అదనుగా భావించి బైక్‌పై వచ్చిన వ్యక్తులు కారులోని రెండు లక్షల నగదు, ఐఫోన్ గోల్డ్ కాయిన్, డాక్యుమెంట్లు కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది తక్.. తక్ గ్యాంగ్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com