పక్కింటి వారి వేధింపులు తాళలేక.. 12వ అంతస్థునుంచి దూకి..

ఏడేళ్ల కొడుకుతో ఒంటరిగా నివసిస్తోంది. ఇరుగు పొరుగు వారు సాయం చేస్తారనుకుంటే ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెడుతున్నారు.

ఏడేళ్ల కొడుకుతో ఒంటరిగా నివసిస్తోంది. ఇరుగు పొరుగు వారు సాయం చేస్తారనుకుంటే ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెడుతున్నారు. భరించలేకపోయింది.. తానుంటున్న అపార్ట్‌మెంట్ 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ముంబైలో జరిగింది.

ముంబైలో ఒక మహిళ తన కుమారుడితో కలిసి 12 వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రేష్మా ట్రెంచిల్ (44), తన కొడుకు అల్లరి చేస్తున్నాడని పక్కింటి వారు తరచు ఫిర్యాదు చేయడం అవమానంగా భావించింది.

రేష్మా భర్త ఇటీవలే కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక అప్పటి నుంచి తన ఏడేళ్ల కుమారుడితో ఒంటరిగా చండివాలిలోని అపార్ట్మెంట్ భవనంలో వారి ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. పక్క ఫ్లాట్‌లో 67 ఏళ్ల అయూబ్ ఖాన్, అతని 60 ఏళ్ల భార్య, వారి కుమారుడు షాదాబ్ ఉంటున్నారు. మే 23 న ఆమె భర్త శరత్ ములుకుట్ల మరణించినప్పటి నుండి ఆమె నిరాశకు గురైనట్లు నివేదికలు చెబుతున్నాయి. శరత్ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా విక్రయించేవాడు.

కోవిడ్ సోకిన తన తల్లిదండ్రులను చూసుకోవటానికి అతను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి వెళ్లి వారికి సపర్యలు చేశాడు. అయినా వారు కోలుకోలేదు. కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి వచ్చిన శరత్ కూడా కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయినా లాభం లేకపోయింది. మే 23న అతడు కూడా కోవిడ్‌తో మరణించారు. అప్పటి నుంచి రేష్మా ఒంటరిగా ఉంటోంది. భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ ఆలోచనలే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కానీ సూసైడ్ నోట్‌లో పొరుగువారి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. దీంతో పోలీసులు పొరుగింటి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story