అశ్లీల వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించిన.. కార్పొరేటర్ అనుచరుడికి మహిళ దేహశుద్ధి

అశ్లీల వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించిన ఓ కార్పొరేటర్ అనుచరుడికి బాధిత మహిళ దేహశుద్ధి చేసిన సంఘటన హైదరాబాద్‌ బాలానగర్‌లో చోటుచేసుకుంది.

అశ్లీల వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించిన.. కార్పొరేటర్ అనుచరుడికి మహిళ దేహశుద్ధి
X

అశ్లీల వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించిన ఓ కార్పొరేటర్ అనుచరుడికి బాధిత మహిళ దేహశుద్ధి చేసిన సంఘటన హైదరాబాద్‌ బాలానగర్‌లో చోటుచేసుకుంది. గౌతమీనగర్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మద్.. బాలానగర్ కార్పొరేటర్‌ అనుచరుడిగా ఉంటున్నాడు. ఫిరోజ్‌గూడకు చెందిన ఓ వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. తరువాత ఆ మహిళకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని ఆమె నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నాడు.

అయితే ఎన్ని రోజులైనా ఇటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రాలేదు. అటు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అహ్మద్‌ను నిలదీసింది సదరు బాధిత మహిళ. దీంతో సయ్యద్ అహ్మద్‌.. ఆమె అశ్లీల ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడు. సహనం కోల్పోయిన బాధిత మహిళ కార్పొరేటర్ కార్యాలయానికి చేరుకుని సయ్యద్‌ అహ్మద్‌ను చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES