సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్ లో మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడడం కలకలం రేపింది. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది.

సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య
X

ఉత్తరప్రదేశ్ లో మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడడం కలకలం రేపింది. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది. అయితే జనవరి 1 (శుక్రవారం) రాత్రి తానూ అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని.. వెంటనే స్థానికులకి సమాచారం అందించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆర్జూ పవార్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అర్జూ ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ ఆ గదిలో లభ్యం అయింది. అందులో తన చావుకు తానే బాధ్యురాలినని, తన పనుల వల్లే తనకు ఈ గతి పట్టిందని ఆమే తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టుగా బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

RELATED STORIES