ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య

ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది

హైదరాబాద్ యప్రాల్‌ బుపేష్‌నగర్‌లో దారుణం జరిగింది. ప్రియుడు ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. మే 24న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. గత కొన్నాళ్లుగా దయాకర్‌, పూజ ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వివాహానికి దయాకర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో తల్లిదండ్రులను ఒప్పించేందుకు పూజను యప్రాల్‌ బుపేష్‌నగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. దయాకర్‌ తల్లిదండ్రులతో దయాకర్ మాట్లాడుతున్న సమయంలో పూజ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దయాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story