Karnataka Crime: యువకుడిపై అత్యాచారం.. ఒంటరిగా వెళ్లడం చూసి..

Karnataka Crime: యువకుడిపై అత్యాచారం.. ఒంటరిగా వెళ్లడం చూసి..
Karnataka Crime: ఈకాలంలో ఆడవారికే కాదు.. మగవారికి కూడా సాటి మగవారి దగ్గర నుండి రక్షణ లేదు.

Karnataka: ఈకాలంలో ఆడవారికే కాదు.. మగవారికి కూడా సాటి మగవారి దగ్గర నుండి రక్షణ లేదు. అబ్బాయిలపై, టీనేజ్ కుర్రాళ్లపై అత్యాచార ఘటనల గురించి ఒకప్పుడు చాలా విన్నాం. ఈమధ్య అలాంటి ఘటనలు తగ్గిపోయాయి అనుకునే లోపు స్మార్ట్ సిటీ కర్ణాటకలో ఇలాంటి దుర్ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని కబాక అనే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు సాయంత్రం సరదాగా వాకింగ్‌కు వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మొహ్మద్ హనీఫ్‌తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు ఒంటరిగా వాకింగ్‌కు వెళ్లడం చూసిన హనీఫ్ తనను పలకరించాడు. తెలిసినవాడే అని ఆ యువకుడు కూడా తనతో సరదాగా మాట్లాడాడు. చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా చెరుకు రసం తాగిస్తానంటూ తీసుకెళ్లాడు హనీఫ్. అది నమ్మి వెళ్లిన యువకుడిని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

భయంతో ఇంటికి వచ్చిన యువకుడు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయాడు. తన బట్టలకు ఉన్న బురద, తన ప్రవర్తనలోని మార్పును గమనించిన తల్లిదండ్రులు విషయం ఏంటని ఆరాతీశారు. దీంతో ఆ యువకుడు వారికి జరిగిందంతా చెప్పాడు. ఆ యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో బెల్గాం పోలీసులు హనీఫ్‌‌పై అత్యాచార కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదంతా చూస్తుంటే స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ రక్షణ కరువయ్యింది అనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story