ఆ రెండు నియోజకవర్గాలలో తండ్రీ కొడుకుల దూకుడు

ఆ రెండు నియోజకవర్గాలలో తండ్రీ కొడుకుల దూకుడు
మల్కాజిగిరి , మెదక్ నియోజకవర్గల్లో తండ్రీ, కొడుకులు దూసుకుపోతున్నారా?మల్కాజ్‌గిరిలో తండ్రి అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారా? మెదక్‌లో మైనంపల్లి వారసుడు రోహిత్ సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారా? తండ్రీ కొడుకులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలను ఆదుకుంటున్నారా?

మల్కాజిగిరి , మెదక్ నియోజకవర్గల్లో తండ్రీ, కొడుకులు దూసుకుపోతున్నారా?మల్కాజ్‌గిరిలో తండ్రి అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారా? మెదక్‌లో మైనంపల్లి వారసుడు రోహిత్ సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారా? తండ్రీ కొడుకులు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలను ఆదుకుంటున్నారా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో క్రమంగా పొలిటికల్​ హీట్​పెరుగుతోంది. ఇందులో భాగంగా అధికార బీఆర్ఎస్‌ నుండి బరిలో దిగేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే తమ టికెట్‌ను కన్ఫమ్ చేసుకుని ప్రచారంలో దిగాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తండ్రీకొడుకులు, లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు స్కెచ్ వేస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ను మెదక్ అసెంబ్లీ బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. తను మల్కాజ్‌గిరి బరిలో దిగుతూనే కుమారుడు రోహిత్‌ను గతంలో తను ప్రాతినిథ్యం వహించిన మెదక్ బరిలో దించాలని యోచిస్తున్నారు.

మైనంపల్లి హన్మంత రావు 2014 లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దశాబ్దాలుగా మల్కాజిగిరిలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. దశాబ్దాలుగా గత పాలకులు తీర్చని మౌలాలి కమాన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు మైనంపల్లి హన్మంత రావు. వరద ముంపు సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఎన్‌డీపీ కింద కోట్లాది రూపాయలతో బాక్స్ డ్రైన్ ల నిర్మాణం చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ లేని విధంగా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో నాలాలను ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ రోడ్ అండర్ బ్రిడ్జిని పూర్తి చేసి మల్కాజిగిరి ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టారు హన్మంత రావు. నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను తీర్చారు. పలు సమస్యల పరిష్కారానికి వచ్చే బాధితులకు భోజనాలు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు , షాదీ ముబారక్ చెక్కులు , కల్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తూ మల్కాజిగిరిని తన కుటుంబంలా భావిస్తున్నారు మైనంపల్లి హన్మంత రావు.

మరో వైపు స్వస్థలం తనకు రాజకీయ భిక్ష పెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన మెదక్ అభివృద్ధి కోసం తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కృషి చేస్తానని మైనంపల్లి హన్మంత రావు గతంలోనే హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు మైనంపల్లి రోహిత్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మైనంపల్లి రోహిత్ ను మెదక్ బరిలో దించాలని వ్యూహరచన చేస్తున్నారు. గతంలో తను మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానని, ఇక నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎక్కువగా అభివృద్ధి చేస్తాడని ... మెదక్ ప్రజలకు మైనంపల్లి హన్మంత రావు హామీ ఇస్తున్నారు.

తండ్రి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మైనంపల్లి రోహిత్ మెదక్ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. మెదక్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మెదక్ టౌన్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారు మైనంపల్లి రోహిత్. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని అనాథ పేద పిల్లలకు ఒకొక్కరికి 25 వేల రూపాయల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. 500 మందికి ఒక కోటి 25 లక్షల రూపాయలను ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ల ను వారికి అందించారు మైనంపల్లి రోహిత్. 1997 నుంచి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తనకు రెండు కళ్ళ లాంటి మెదక్ , మల్కాజిగిరి ప్రజలకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని మైనంపల్లి రోహిత్ భరోసా కల్పిస్తున్నారు. గతంలో మెదక్ ఎమ్మెల్యేగా తన తండ్రి మైనంపల్లి హన్మంత రావు ప్రతి గ్రామం లో బోర్లు వేయించి అందరికి త్రాగు నీరు అందించారని గుర్తు చేశారు. తాజాగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా బోర్లు వేయిస్తున్నట్లు రోహిత్ తెలిపారు. అలాగే ప్రజలకు శుద్ధమైన త్రాగు నీరు అందించేందుకు నార్సింగి మండలంలో R O ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు మైనంపల్లి రోహిత్.

ఇప్పటి కే మైనంపల్లి రోహిత్ రాక ను స్వాగతించిన మెదక్ ప్రజలు పార్టీలకు అతీతంగా గెలిపిస్తామని చెబుతున్నారు. అటు సర్వేలు కూడా మెదక్‌లో మైనంపల్లి రోహిత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. సేవా కార్యక్రమాలలో భాగంగా మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటికి ఆధునిక హంగులను సమకూర్చుతున్నారు మైనంపల్లి రోహిత్. మెదక్ గర్ల్స్ హైస్కూల్ , దామర చెరువు స్కూల్లలో కలర్స్ తో పాటు కంప్యూటర్ లాబ్‌లు , CCTV, పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల పెళ్ళిలకు మంగళ సూత్రాలు, మెట్టెలు అందిస్తున్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల మంది పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా పేదలకు వైద్య సాయం కూడా అందిస్తున్నారు. ఇటీవల పరీక్షల సమయంలో విద్యార్ధినీ విద్యార్థులకు అవసరమైన ప్యాడ్‌లు, స్టేషనరీ అందించారు. నిత్యం సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు మైనంపల్లి రోహిత్.

మెదక్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని మైనంపల్లి రోహిత్ భరోసా కల్పిస్తున్నారు. మొత్తం మీద ఒక వైపు మల్కాజిగిరి ని , మరో వైపు మెదక్ ను ... రెండు కళ్ళలా భావిస్తున్న మైనంపల్లి కుటుంబానికి ఆ రెండు నియోజకవర్గాలలో ప్రజలు జై కొడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story