Editorial: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాన్‌కి ఎదురు గాలి

Editorial: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాన్‌కి ఎదురు గాలి
రాయలసీమ జిల్లాల్లో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోందా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాన్ రిపేర్‌కు వచ్చిందా? ఫ్యాన్ స్పీడ్ తగ్గడంతో వైసీపీలో ఉక్కపోత మొదలయిందా? పార్టీని నమ్ముకున్న నేతలు గుర్తింపు లేక మథనపడుతున్నారా?నాలుగేళ్లు దాటినా అభివృద్ధి జరగలేదంటూ సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారా?

రాయలసీమ లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలు,నారా లోకేష్ యువ గళం పాదయాత్ర భారీ సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ప్రజలు ఇసుకేస్తే రాలనంతగా తరలి వస్తున్నారు. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాయలసీమలో టీడీపీకి వస్తున్న ఆదరణను చూసిన వైసీపీ నేతలు, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న దిగువ స్థాయి నేతలు డైలమాలో పడి పోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేదు..గ్రామాల్లో జాడకైనా అభివృద్ధిలేదని వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. జనం లోకి వెళితే నిలదీతలు,నిరసన సెగలు తప్పడం లేదని ..ప్రజలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నామంటూ వైసీపీ నేతలు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్యాడర్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీలో ఉండి ఇబ్బందులు పడే కంటే..ఇప్పుడే టీడీపీ లోకి వెళితే తగిన గుర్తింపు, న్యాయం జరుగుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫ్యాన్‌కింద ఉక్కపోతకు గురవుతున్న నేతలు గోడ దూకేసి సైకిల్ ఎక్కేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ లో వైసీపీ నుంచి టీడీపీ లోకి ఊహించని విధంగా వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్, టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిల ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ లీడర్లు, కార్యకర్తలు టీడీపీ లోకి జంప్ అవుతున్నారు. ఆళ్ళగడ్డ సెగ్మెంట్ లోని చెన్నూరులో 70 బీసీ కుటుంబాలు,ఇసుకపల్లెలో 45 ఎస్సీ కుటుంబాలు వైసీపీ వైస్ సర్పంచ్ టీడీపీలో చేరి పోయారు.. ఇదే సెగ్మెంట్‌లో కందుకూరు, తోడేండ్ల పల్లిలో పదుల సంఖ్యలో కుటుంబాలు..వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరిపోయారు. రామచంద్రాపురంలో 100 కుటుంబాలు ఓ ఎంపిటిసి టీడీపీ లో చేరగా..తాజాగా సిరివెళ్ళ టౌన్ లో 45 కాపు కుటుంబాలు వైసీపీ ని వీడి సైకిల్ ఎక్కారు...నంద్యాలలో శిల్పా ప్రధాన అనుచరుడు అడ్వొకేట్ తులసి రెడ్డి భారీ కాన్వాయ్ తో వెళ్లి అఖిల ప్రియ ,జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ సమక్షంలో..నారా లోకేష్ ని కలసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ సొంత అన్న జరదొడ్డి సుదర్శన్ టీడీపీ నేత కోట్ల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు..ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు రమేష్ యాదవ్.వైసీపీ కి గుడ్ బై చెప్పారు..రాష్ట్రంలో యాదవ కులస్తులకు న్యాయం జరగలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ భార్య 31వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ కావడంతో..వైసిపి ప్రభుత్వం మున్సిపల్ వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు..రమేష్ యాదవ్ దంపతులు త్వరలో సైకిల్ ఎక్కే ఛాన్స్ ఉందని క్యాడర్ లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రి బుగ్గన సెగ్మెంట్ లోని ప్యాపీలి పంచాయతీ మాజీ సర్పంచ్ గౌసియా బేగం, భర్త వైసీపీ నేత అంకిరెడ్డి ఇతర అనుచరులు వైస్సార్సీపీ ని విడిచి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు..

వరుస చేరికలు టీడీపీలో జోష్ నింపగా అటు వైసీసీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న నేతలు తాము కూడా సైకిల్ ఎక్కేస్తామంటూ టీడీపీ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story