Editorial: మల్కాజ్‌గిరిలో హస్తం దూకుడు

Editorial: మల్కాజ్‌గిరిలో హస్తం దూకుడు
అధిష్ఠానం ఆశీస్సుల కోసం పడిగాపులు పడుతున్న ఆశావాహులు; సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించే ఆలోచనలో అధిస్ఠానం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల్లో ఎన్నికల సందడి మొదలయింది. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎత్తులు వేస్తోంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్‌ వ్యూహాలకు పదును పెడుతోంది. అధికార పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.అధిష్ఠానం ఆశీస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. అయితే అధిష్ఠానం మాత్రం సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలో దిగేందుకు పలువురు పోటీ పడుతున్నారు. 2009లో ఏర్పాటయిన మల్కాజ్ గిరి నియోజకవర్గ లో మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల రాజేందర్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కనకారెడ్డి గెలుపొందారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి మైనంపల్లి హన్మంత రావు విజయం సాధించారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న బీజేపీ అనూహ్యంగా మూడోస్థానానికి పడిపోయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కర్ణాటక ఫలితాల కాంగ్రెస్‌ శ్రేణులు జోష్ మీద ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మల్కాజ్ గిరి లో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చి కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు తహ తహ లాడుతున్నారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా DCC ప్రెసిడెంట్ అయిన నందికంటి శ్రీధర్ మల్కాజ్ గిరి కాంగ్రెస్ టికెట్ రేసులో ముందు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2002 లో అల్వాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌ గా పని చేసిన నందికంటి శ్రీధర్ ....2009 లో GHMC కో అప్షన్ మెంబర్ గా పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్ధి గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 లో కాంగ్రెస్ టికెట్ ఆశించినా ...పొత్తులో భాగంగా TJS కు టికెట్ దక్కడంతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి లో 10,300 ఓట్ల లీడ్ రావడం నందికంటి శ్రీధర్ కీలకంగా వ్యవరించినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ సారి మల్కాజ్ గిరి అసెంబ్లీ కాంగ్రెస్ బరి లో నిలిచేందుకు సిద్ధమైన నందికంటి శ్రీధర్....తన తండ్రి నందికంటి శ్రవణ్ కుమార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి చేరువవుతున్నారు. నందికంటి శ్రీధర్. హాత్ సే హాత్ జోడో పాద యాత్రతో నందికంటి శ్రీధర్....కాంగ్రెస్ హస్తం కాలనీ నేస్తం పేరు తో మల్కాజిగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పై అలుపెరగని పోరాటం చేస్తున్న తనకే మల్కాజ్ గిరి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు...నందికంటి శ్రీధర్.

Tags

Read MoreRead Less
Next Story