అధిష్ఠానంపై పొన్నం అలక

అధిష్ఠానంపై పొన్నం అలక

పార్టీ అధిష్ఠానం మీద పొన్నం ప్రభాకర్ అలిగారా?
పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని అసంతృప్తితో రగిలిపోతున్నారా?
ఆఫర్లు వచ్చినా పొన్నం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారా?
బీసీ నేత కావడంవల్లే తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారా?


సమయం మనది కానప్పుడు గడ్డి పరక సైతం తాచుపాముల కాటేస్తుందనే సామెత అక్కడ నేతకి సరిగ్గా సరిపోతుంది. అవును నిజమే ఉద్యమ సమయం నుండి తెలంగాణ సిద్దించే వరకు అధిష్టానాన్ని సైతం ఎదిరించిన నేత అతను... తెలంగాణ వచ్చాక తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలించిందన్నట్టు మారిందట అందుకే కాబోలు అటు నియోజకవర్గం నుండి మొదలుకొంటే స్వంత పార్టీ సైతం కాదన్నారట అందుకే తన వర్గాన్ని తన స్టైల్ లోనే నిద్రలేపారట కొత్తగా ఓసి బీసీ నినాదం తెరపైకి తెచ్చారట ఇదిఅంతా బహిరంగ రహస్యమేనట ఇంతకీ ఎవరా నేత లెట్స్ వాచ్ ది ఓపెన్ సీక్రెట్.

ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నేత పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ అవిర్భావం అనంతరం రాజకీయంగా కలిసి రాలేదనే టాక్ నడుస్తోంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర అవిర్భావం అనంతరం కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. అయితే విభజన అనంతరం జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా బరిలో దిగిన పొన్నం ప్రభాకర్ అనూహ్య ఓటమి పాలయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్.. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ రెండు సార్లు ఓడిన సానుభూతి పని చేస్తుందని భావించిన పొన్నం ప్రభాకర్ 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ పరాజయం పాలయ్యారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరిగిన మార్పులు చేర్పుల అనంతరం పొన్నం ప్రభాకర్‌ను ఎలాంటి పదవి వరించలేదు. వరుసగా ఓటమి పాలవడంతో పార్టీ తనను అవమానించదనే ఆవేదనలో పొన్నం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నాటి ఉద్యమం నుండి పార్టీనే నమ్ముకున్నప్పటికి తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వక పోవడంపై అసంతృప్తిగా ఉన్న పొన్నం సన్నిహితులవద్ద ఆవేదన వెళ్లగక్కినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

పదవి లేకున్నా పార్టీలోనే ఉంటానని అధిష్ఠానాన్ని ఎదురించేది లేదంటున్నారు. పదవుల కోసం కొందరు నేతలు పార్టీని వీడారని తనకు ఇతర పార్టీల నుండి ఆఫర్స్ వచ్చినా వెళ్లలేదని సన్నిహితుల వద్ద చెబుతున్నారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించకపోవడం పట్ల కరీంనగర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిటీల్లో అవకాశం కల్పించకపోవడం ఆయన్ను అవమానపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న బీసీ నేత పొన్నం ప్రభాకర్ ను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు ఎన్నికల కమిటీల్లో స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఎల్సీ జీవన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు గౌరవం దక్కిందని తాను బీసీ కావడంతో ఎదగలేకపోయానని పొన్నం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది కాంగ్రెస్ ద్వీతీయ శ్రేణి నేతలు పొన్నం ఆవేదనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వివరించడంతో సముచిత పదవి లభిస్తుందని హామీ ఇవ్వడంతో పొన్నం శాంతించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story