Apple Pay: త్వరలోనే భారత్‌లోకి యాపిల్ పే సదుపాయం..!! UPI సేవలకు అవకాశం

Apple Pay: త్వరలోనే భారత్‌లోకి యాపిల్ పే సదుపాయం..!! UPI సేవలకు అవకాశం


భారత్‌లో యాపిల్ ప్రొడక్ట్స్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తమ యాపిల్ ఉత్పత్తుల కోసం ఇటీవలె ముంబయిలో సొంతంగా స్టోర్ ఓపెన్ చేసిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్ (APPLE), త్వరలోనే ఆపిల్ పే ద్వారా పేమెంట్ సేవల్లోకి రానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికోసం యాపిల్ సంస్థ బాస్ టిమ్ కుక్ భారత అధికారులను కలిసినట్లు సమాచారం.



GSMఎరీనా తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భారత్‌లో RBI లోని ప్రత్యేక విభాగం అయిన NCPI తో చర్చలు జరపాలని చూస్తోంది. భారత వినియోగదారులు, అభిరుచులకు తగినట్లుగా, QR కోడ్‌, ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల సాయం లేకుండానే UPI ట్రాన్సాక్షన్లు నిర్వహించేలా ఆపిల్‌ పే (Apple Pay)ని రూపొందించేలా చర్చలు నిర్వహించారు. అలాగే ఫేస్ ఐడీ (FACE ID)ని ఉపయోగించి ట్రాన్సాక్షన్లు చేసేలా యాప్‌ని రూపొందించనున్నారు. అయితే స్థానికంగా ఏ బ్యాంకుతోనూ చర్చలు నిర్వహించలేదు. బ్యాంకులతో కలిసి క్రెడిట్ కార్డ్ తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.

భారత్‌లో ఇప్పటికే ఫోన్‌ పే, గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం వంటి సంస్థలు UPI సేవలు అందిస్తూ ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో భాగం అయ్యాయి. ఇప్పుడు ఆపిల్ పే వీరితో పోటీపడాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం మార్చి నెలలో, US లో 'ఆపిల్ పే లేటర్ (Apple Pay Later)' సౌకర్యాన్ని కొంత మంది వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు మొదట వస్తువును కొని, కొద్ది రోజుల తర్వాత దానికి చెల్లింపులు చేయవచ్చు. దీని ద్వారా కొన్న వస్తువులకు వడ్డీ లేకుండా 4 వాయిదాల్లో, 6 వారాల గడువులోగా చెల్లించే సదుపాయం కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఐఫోన్‌-15 ని ఆవిష్కరించనుంది.

Tags

Read MoreRead Less
Next Story