ITR Filing: ITR ఫైలింగ్‌కి తుది గడువు నేడే, గడువు పెంచే అవకాశం ఉందా..?

ITR Filing: ITR ఫైలింగ్‌కి తుది గడువు నేడే, గడువు పెంచే అవకాశం ఉందా..?
గడువులోగా దాఖలు చేయలేకపోతే రూ.1000 నుంచి 5000 వరకు జరిమానా పడుతుంది.

2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి తుది గడువు నేటితో ముగియనుంది. అయితే ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో పలువురు రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నామని కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. రిటర్న్స్‌ దాఖలుకు గడువు పెంచాలని కోరుతున్నారు. గడువులోగా దాఖలు చేయలేకపోతే రూ.1000 నుంచి 5000 వరకు జరిమానా పడుతుంది.

గత కొన్నివారాలుగా కేంద్ర ప్రభుత్వంలోని ఆదాయపన్నుకు సంబంధించిన విభాగాలు ITR ఫైల్స్ దాఖలు చేయడంపై వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టారు. దీంతో ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో 6 కోట్ల మంది ఫైలింగ్ చేశారు. ఇదొక మైలురాయిగా అధికారులు వెల్లడించారు. ఇందులో 7 శాతం మంది కొత్తగా రిటర్న్స్‌ ఫైల్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే 26.76 లక్షల ITRలు ఫైలింగ్ అయ్యాయి.

గత నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగియనున్న గడువును పొడిగించవచ్చని పలువురు CAలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదురైతే వాటి వివరాలతో orm@cpc.incometax.gov.in కి ఈ-మెయిల్ చెయ్యాలి.

రిటర్న్స్‌ ఎలా దాఖలు చేయాలి అంటే..

- ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ https://www.incometax.gov.in/iec/foportal/ ను సందర్శించండి.

-మీ వివరాలను నమోదు చేయండి. మీ వినియోగదారు ID (PAN), పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ నమోదు చేసి పోర్టల్‌కు లాగిన్ అవ్వండి

-'e-File' మెనూపై క్లిక్ చేసి, 'Income Tax Return' లింక్‌ని క్లిక్ చేయండి.

-ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌ను ఎంచుకోండి. మీ వద్ద ఫారమ్-16ని ఉంటే ITR-1 లేదా ITR-2ని ఉపయోగించవచ్చు.

-మీరు ITR ఫైల్ చేయాలనుకుంటున్న అసెస్‌మెంట్ ఇయర్ (AY)ని ఎంచుకోండి. ఈసారి, మీరు 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి.

-ఫారమ్‌లో నమోదు చేసిన మొత్తం డేటాను తనిఖీ చేసి, సమర్పించండి.

-సబ్‌మిట్ చేసిన తర్వాత మీ ఫారమ్‌ను ఇ-ధృవీకరించండి(e-verify). దీని కోసం ఆధార్ OTP వంటి అందుబాటులో ఉన్న ఏదైనా ఆప్షన్‌ను ఉపయోగించండి.

-అప్‌లోడ్, ఇ-వెరిఫై రిటర్న్ చేయడంతో రిటర్న్స్‌ దాఖలు పూర్తవుతుంది.



Tags

Read MoreRead Less
Next Story