Smart TV:కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసిన సోనీ.. ఫీచర్స్ అదుర్స్

Smart TV:కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసిన సోనీ.. ఫీచర్స్ అదుర్స్


అద్భుతమైన 4K క్లారిటీ, క్రిస్టల్ క్లియర్ సౌండ్‌తో సినిమాలు చూస్తూ కొత్త అనుభవం కోరుకునే వారికోసం సోనీ ఇండియా 4K అల్ట్రా హెచ్‌డీ LED డిస్‌ప్లేతో కొత్త BRAVIA X70L టెలివిజన్ సిరీస్‌ను ప్రకటించింది. అత్యాధునిక స్మార్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ టీవీ వీక్షకులను అద్భుతమై అనుభూతివ్వనుంది. 4K సెగ్మెంట్‌లో ఉన్న టీవీల్లో ఇదే అత్యుత్తమైనది. ఈ టీవీ 108 సెంటీమీటర్లు (43 అంగుళాలు), 126 సెంటీమీటర్లు (50 అంగుళాలు) రెండు వారియంట్లలో వస్తోంది. వీటి ధరలు రూ. 48,990, రూ. 61,990 గా నిర్ణయించింది. సోనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్‌ స్టోర్స్, ఎలక్ట్రానిక్ స్టోర్లు అన్నింట్లో ఇది అందుబాటులో ఉండనుంది.

సొగసైన, అద్భుతమైన స్క్రీన్...

ఈ టీవీ తక్కువ బెజెల్స్‌తో సన్నగా, సొగసుగా ఉంటూ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇందులోని శక్తివంతమైన X1 పిక్చర్ ప్రాసెసర్ అత్యాధునిక అల్గారిథమ్స్, లైవ్ కలర్ టెక్నాలజీ ఉపయోగించి టీవీ రంగుల్ని మరింత స్పష్టంగా, మృదువుగా వీక్షకులకు అందిస్తుంది. X70Lలోని X-రియాలిటీ PRO మరియు Motionflow™ XR అద్భుతమైన 4K రెజల్యూషన్ చిత్ర నాణ్యతను అందిస్తూ కళ్లకు కట్టినట్లుగా చూయిస్తుంది. మోషన్‌ ఫ్లో టెక్నాలజీ సాయంతో వేగంగా వెళ్లే చిత్రాల్ని ఏ ఇబ్బంది లేకుండా అత్యంత స్పష్టంగా చూడవచ్చు.

అదిరిపోయే సౌండ్ క్వాలిటీ..

డాల్బీ ఆడియో, శక్తివంతమైన క్లియర్ ఫేజ్ టెక్నాలజీతో 20-వాట్ల శక్తివంతమైన ట్విన్ డాల్బీ ఆడియోతో రానుంది. ఈ స్పీకర్లు సినిమా, క్రీడలు, సంగీతానికి అనుగుణంగా స్పష్టమైన, సహజసిద్ధమైన శబ్ధాన్ని అందిస్తాయి. దీంతో వినియోగదారులు సహజసిద్ధమైన, అత్యంత స్పష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

స్మార్ట్ టెక్నాలజీ..

గూగుల్ టీవీ సాంకేతికతో రానున్న ఈ స్మార్ట్‌టీవీలో 10 వేలకు పైగా యాప్స్, 7 లక్షలకు పైగా గేమ్స్, చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లు ఒక్క క్లిక్‌ దూరంలోనే ఉండనున్నాయి. మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ని టీవీకి కనెక్ట్ చేసి మీకు ఇష్టమైన అంశాల్ని ఒకే చోట ఉంచుకోవచ్చు.

యాపిల్ ఎయిర్‌ప్లే 2, హోంకిట్‌ల సహాయంతో యాపిల్ ఐపాడ్స్, ఫోన్స్, ఇతర యాపిల్ పరికరాల్ని సులభంగా అనుసంధానించవచ్చు.

గూగుల్‌ అసిస్టెంట్‌ వాయిస్ కంట్రోల్‌తో పనిచేసే రిమోట్‌తో "హే గూగుల్, ప్లే సోలో మ్యూజిక్" అంటూ వాయిస్‌ కమాండ్స్‌తో మీకు కావాలసిన సంగీతం, యాప్స్, మూవీస్, గేమ్స్‌ని మరింత వేగంగా, సులభంగా వెతకవచ్చు.

సురక్షితం..

XR ప్రొటెక్షన్ ప్రో టెక్నాలజీ సాయంతో టీవీ ఎక్కువ రోజులు మన్నికగా ఉండగలదు. దుమ్ము, తేమ, ఉరుములు, మెరుపులు వంటి కఠినమైన సందర్భాల్ని కూడా తట్టుకుని ఎక్కువ రోజులు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story