Bariatric Surgery : వయసు 2 ఏళ్లు.. బరువు 45 కేజీలు.. బేరియాట్రిక్ సర్జరీతో..

Bariatric Surgery : వయసు 2 ఏళ్లు.. బరువు 45 కేజీలు.. బేరియాట్రిక్ సర్జరీతో..
అమ్మానాన్నకి అర్థం కాలేదు.. బిడ్డ బరువు రోజు రోజుకి ఇలా పెరిగిపోతోందేమిటని కంగారు పడ్డారు.

Bariatric Surgery : రెండు సంవత్సరాల బిడ్డకి బేరియాట్రిక్ సర్జరీ చేసి పాపకు పునర్జన్మను ప్రసాదించారు ఢిల్లీ డాక్టర్లు. అమ్మానాన్నకి అర్థం కాలేదు.. బిడ్డ బరువు రోజు రోజుకి ఇలా పెరిగిపోతోందేమిటని కంగారు పడ్డారు.

వైద్య సాహిత్యం ప్రకారం, పసిబిడ్డ ఖ్యాతి వర్ష్నే, దేశంలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న అతి పిన్న వయస్కురాలని వైద్యులు చెప్పారు. ఖ్యాతి వర్ష్నీ తల్లిదండ్రులు ఆమెకు మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు పాప బరువు పెరగడాన్ని గమనించారు.

నగర వైద్యులు రెండు సంవత్సరాల శిశువుకు ప్రాణాలను కాపాడే బారియాట్రిక్ శస్త్రచికిత్స చేశారు. పెరిగిన బరువుతో పాపకు నడవడానికి రావట్లేదు, పాకడం కూడా చేయలేకపోయింది. దీంతో తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. రెండేళ్ల వయస్సున్న పిల్లల ఆరోగ్యకరమైన బరువు 12 కిలోల నుండి 15 కిలోల మధ్య ఉంటుంది.

పట్పర్‌గంజ్‌లోని మాక్స్ హాస్పిటల్ వైద్యులు, పసిబిడ్డ ఖ్యాతికి ఒక సంవత్సం నుంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఆమె స్లీప్ అప్నియాతో బాధపడుతుందని, అందుకే బరువు పెరుగుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయారు.

వైద్యులు నిర్వహించిన నిద్ర పరీక్ష, శస్త్రచికిత్సకు కొన్ని రోజుల ముందు, నిద్రలో పాప ఆక్సిజన్ లెవెల్స్ 75% కి పడిపోయిందని తేలింది. ఆరోగ్యకరమైన వక్తుల ఆక్సిజన్ స్థాయి 95% మరియు 100% మధ్య ఆక్సిజన్ స్థాయి ఉండాలి. 94% కంటే తక్కువ ఆక్సిజన్ ఉన్న కోవిడ్ -19 రోగులను ఆసుపత్రికి వెళ్లమని చెబుతుండడం తెలిసిందే.

ఖ్యాతి తల్లిదండ్రులు మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు అధిక బరువును గమనించడం ప్రారంభించారు. "బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన పిల్ల కదా బలమైన ఫుడ్ పెడుతున్నారని అనుకున్నారు బంధువులంతా. కానీ పాప బరువుకి ఆహారం కారణం కాదని తెలిసి ఆందోళన చెందారు. ఆరు నెలల్లో, ఆమె బరువు 15 కిలోలు పెరిగింది. శస్త్రచికిత్సకు ముందు, ఖ్యాతి తల్లి 50 కిలోల బరువు ఉంటే. పాప 45 కిలోలు ఉండేది, "అని ఆమె తండ్రి రాహుల్ వర్ష్నీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story