పొడి దగ్గు పడుకోనివ్వట్లేదు.. ఏం చెయ్యాలి..

పొడి దగ్గు పడుకోనివ్వట్లేదు.. ఏం చెయ్యాలి..
బాబోయ్ దగ్గు, జలుబు ఎవరికీ రాకూడదు.. బాధ పడుతున్న వారితో పాటు పక్క వాళ్లకీ ఇబ్బందే..

బాబోయ్ దగ్గు, జలుబు ఎవరికీ రాకూడదు.. బాధ పడుతున్న వారితో పాటు పక్క వాళ్లకీ ఇబ్బందే.. ఇక రాత్రుళ్లయితే చెప్పక్కర్లేదు.. వాళ్లు నిద్ర పోరు.. పక్కవాళ్లని నిద్ర పోనివ్వరు. మరి వీటి ప్రభావాన్ని తగ్గించే కొన్ని చిట్కాలు చూడడానికి సింపుల్‌గానే అనిపిస్తాయి. కానీ అవి ప్రభావవంతంగా పని చేస్తాయి.

పసుపు వేసిన పాలు.. ఆయుర్వేద నిపుణుడు, డాక్టర్ బిఎన్ సిన్హా సూచించిన ప్రకారం.. మీ గొంతును క్లియర్ చేయడానికి ప్రతిరోజూ రెండుసార్లు 1/2 టీస్పూన్ పసుపుని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వేసుకుని తాగాలని అంటున్నారు. దగ్గు మరీ విపరీతంగా వేధిస్తుంటే పాలు, పసుపుతో పాటు వెల్లుల్లి, లవంగాన్ని కలపి తాగాలి. వెల్లుల్లి వాసన పడని వారు అల్లం జోడించి కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు గోరు వెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి గొంతులో పోసుకుని పుక్కిలించాలి.

పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల ఏజెంట్ ఉంది, ఇది బలమైన యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, ఇది ఇన్ఫెక్షన్ల చికిత్సకు సహాయపడుతుంది. అల్లం, వెల్లుల్లి గొంతులోని గరగరను తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో పాటు సహజ అనాల్జెసిక్‌లుగా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు తాగడం వలన వేడి పాలు మీ ఛాతీ నుండి శ్లేష్మం పైకి రావడానికి సహాయపడుతుంది.

దానిమ్మ రసం.. 1/2 కప్పు దానిమ్మపండు రసం, చిటికెడు అల్లం పొడితో కలిపి తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. దానిమ్మ రసం గొంతుపై తేలికపాటి ప్రభావాన్ని చూపుతుంది. దానిమ్మలో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం, మిరియాలు తో భర్తీ చేయవచ్చు.

మసాలా టీ.. 1/2 టీస్పూన్ అల్లం పొడి, ఒక చిటికెడు దాల్చినచెక్క, కొన్ని లవంగాలు కలిపి మసాలా టీ తాగితే దగ్గు నుంచి రిలీఫ్‌గా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తగ్గిస్తాయి. ముక్కు కారటాన్ని తగ్గిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story