sleep tips: హాయిగా నిద్ర పోవాలంటే ఈ ఆరు చిట్కాలు..

sleep tips: హాయిగా నిద్ర పోవాలంటే ఈ ఆరు చిట్కాలు..
మంచి నిద్ర పట్టాలంటే మన దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ సాధారణ చిట్కాలతో ఈ రోజు ప్రయత్నించండి.

sleep tips: మంచి నిద్రకు ఆటంకం కలిగించే కొన్ని అంశాల గురించి ఆలోచించాలి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యాలు, ఊహించని సంఘటనలు కొన్నిసార్లు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి.

మంచి నిద్ర పట్టాలంటే మన దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ సాధారణ చిట్కాలతో ప్రయత్నించి చూడండి..

1. నిద్రకూ ఓ షెడ్యూల్‌ ఉండాలి..

సమయానికి ఆఫీస్ కి వెళ్లాలి పంచ్ కొట్టాలి. లేదంటే మేనేజర్ నుంచి నోటీస్ అందుకోవాల్సి ఉంటుంది. అలాగే నిద్రకి కూడా సమయం ఉంటుంది. నిద్ర సమయం ఎనిమిది గంటలు అనుకోవద్దు. మంచి కలత లేని నిద్ర ఏడు గంటలైనా సరిపోతుంది. నిజానికి వైద్యులు సిఫారసు చేసిన సమయం ఏడు గంటలే. ఎనిమిది గంటలు అవసరం లేదు.

ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోండి.. ఒకే సమయంలో లేవండి. వీకెండ్స్ అని మరీ లేట్ చేయకుండా రోజు కంటే ఓ గంట ఆలస్యంగా పడుకోవడం, లేవడం చేయొచ్చు.

మీకు సుమారు 20 నిమిషాల్లో నిద్రపట్టకపోతే, మీ బెడ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేయండి. మంచి మ్చూజిక్ వినండి లేదా ఓ మంచి పుస్తకం చదవండి. నిద్ర వచ్చినప్పుడు వెళ్లి పడుకోండి.

2. మీరు తినే వాటిపైన, త్రాగే వాటిపైన శ్రద్ధ వహించాలి

ఆహారం త్వరగా తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే తేలిక పదార్థాలు తీసుకోవాలి.

నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ వంటి ఉత్తేజపరిచే కారకాలు నాణ్యమైన నిద్రను నాశనం చేస్తాయి. మద్యం మీకు నిద్రను కలిగించినప్పటికీ, ఆ తరువాతి రోజు నిద్రకు భంగం కలిగిస్తుంది.

3. నిద్రించే ప్రదేశం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

నిద్రించడానికి అనువైన ప్రదేశం ఉంటే అంటే త్వరగా నిద్ర పడుతుంది. మీ అవసరాలకు తగిన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

నిద్రవేళకు ముందు స్నానం చేయడం వంటివి మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.

4. పగటిపూట నిద్ర మంచిది కాదు.

పగలు కుర్చీలో కునుకు అయితే ఫరవాలేదు కానీ ఎక్కువ సేపు పడుకుంటే మాత్రం రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

5. మీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చండి

క్రమం తప్పకుండా శారీరక శ్రమ మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

6. సమస్యల గురించి ఆలోచించకండి

నిద్రవేళకు ముందు మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ మనస్సుని ఆలోచనల నుంచి కట్టడి చేయడానికి ప్రయత్నించండి. ధ్యానం కూడా ఆందోళనను తగ్గిస్తుంది.

మీ వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలో తెలుసుకోండి

దాదాపు ప్రతిఒక్కరికీ అప్పుడప్పుడు నిద్రలేని రాత్రి ఉంటుంది. కానీ మీరు తరచుగా నిద్ర లేమితో బాధపడుతూ ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి. ఏదైనా అంతర్లీన కారణం ఉందేమో గుర్తించి చికిత్స అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story