Top

శీతాకాలం 'సైనస్' భయం.. ఇంటి వైద్యం కొంత నయం..

మందులెన్ని వాడుతున్నా సైనస్‌కు కొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి

శీతాకాలం సైనస్ భయం.. ఇంటి వైద్యం కొంత నయం..
X

శీతాకాలం సైనస్ రోగులను మరింత ఇబ్బంది పెడుతుంది. సైనసెస్ అనేది ముక్కుకు ఇరువైపులా గాలితో నిండి ఉన్న కావిటీస్. అలెర్జీలు, జలుబు లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, ఈ కావిటీస్ మూసుకుపోతాయి. సైనస్‌తో బాధపడుతున్న వారికి తలనొప్పి, గురక లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వివిధ సమస్యలను సృష్టిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, సైనస్ సంక్రమణ మెదడు జ్వరం లేదా మెనింజైటిస్‌కు కూడా దారితీయవచ్చు.

సైనస్ సమస్యలు నాలుగు రకాలు. తీవ్రమైన సైనస్ సాధారణంగా 4 వారాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంటుంది. ఒక్కోసారి 4 నుండి 8 వారాల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక సైనస్ 8 వారాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అయితే మందులెన్ని వాడుతున్నా సైనస్‌కు కొన్ని హోం రెమెడీస్ కూడా ఉన్నాయి.. ఇవి మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. మరి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేయించిన ఆహార పదార్థాలు, పిండి పదార్ధాలు, బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాలు వంటి సైనస్ లక్షణాలను ప్రేరేపించే కొన్ని ఆహారాలు మానుకోవాలి. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సైనస్‌ను ఎదుర్కోవచ్చు. క్లినికల్ ఆపరేషన్స్, కోఆర్డినేషన్ మేనేజర్, బైద్యనాథ్ డాక్టర్ అశుతోష్ గౌతమ్.. సైనస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన కొన్ని ఆహార జాగ్రత్తలను సూచిస్తున్నారు.

" పాల ఉత్పత్తులు , ముఖ్యంగా జున్ను, పెరుగు మరియు ఐస్ క్రీం మానుకోవాలి. అలాగే, చాక్లెట్, చక్కెర, ఈస్ట్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి సైనస్‌లలో అధిక శ్లేష్మం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. శీతల పానీయాలు, చల్లని ద్రవాలను తీసుకోవడం వలన ముక్కు లోపల సిలియా కదలికను నిలిపివేస్తుంది. నాసికా శ్లేష్మం నాసికా మార్గాల ద్వారా ప్రవహించడం కష్టమవుతుంది "అని ఆయన చెప్పారు.

1. హైడ్రేటెడ్ గా ఉండండి

చక్కెర లేకుండా టీ తీసుకోవడం ఉత్తమం. ఈ ద్రవాలు శ్లేష్మాన్ని పలుచన చేసేందుకు సహాయపడతాయి. దీంతో సైనస్‌ గ్రంధులకు ఉపశమనం కలుగుతుంది. ఆల్కహాల్ , కెఫిన్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

2. మసాలా

దినుసులు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్న సుగంధ ద్రవ్యాలతో చేసిన పౌడర్ శ్లేష్మం విడిపోయి బయటకు పోవడానికి సహాయపడతాయి. అదేవిధంగా, ముల్లంగిని ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నిమ్మరసంతో కలిపి శ్లేష్మం కరిగించే అమృతాన్ని సృష్టించవచ్చు. ప్రత్యామ్నాయంగా, తాజాగా తురిమిన ముల్లంగి రసం 1/4 టీస్పూన్ కొన్ని నిమిషాలు నోటిలో ఉంచి తర్వాత దానిని మింగవచ్చు.

3.స్టీమ్

ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుందని వైద్యులు కూడా దీనిని సూచిస్తారు. 2,3 చుక్కల యూకలిప్టస్ నూనెను బాగా వేడి చేసిన నీళ్లలో వేసి ఓ పలుచని దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టాలి. ఇది నాసికా మార్గాన్ని క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.

4. పసుపు (హల్ది) మరియు అల్లం రూట్

పసుపులో సహజ శోథ నిరోధక లక్షణాలు ఉండటమే కాదు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అల్లం వేసి తయారు చేసిన టీ తాగితే మూసుకుపోయిన నాసికా రంద్రాలు తెరుచుకుంటాయి. సైనస్ ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేద హోమ్ రెమెడీస్' అనే పుస్తకంలో 1 స్పూన్ తేనెతో తాజా అల్లం రసం కలిపి రోజుకు 2 నుండి 3 సార్లు తీసుకుంటే సైనస్ తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు.

5. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన సహజ పదార్ధం. ఒక కప్పు వేడినీరు లేదా టీలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే సైనస్ ఒత్తిడి తగ్గి నాసికా రంధ్రాల్లో ఉన్నఅధిక శ్లేష్మం పలచబడడానికి సహాయపడుతుంది. రుచికోసం ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనెతో కలపండి.

6. సూప్

చికెన్ సూప్ లేదా తాజా కూరగాయలతో చేసిన సూప్ సైనస్‌లను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.

Next Story

RELATED STORIES