అధిక రక్తపోటును నివారించే 'అజ్వైన్' వాటర్..

అధిక రక్తపోటును నివారించే అజ్వైన్ వాటర్..
అజ్వైన్ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల..

రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్యగా మారింది. దీనిని అధిక రక్తపోటు అని కూడా పిలుస్తారు, ఈ పరిస్థితి గుండె జబ్బులు మరియు తీవ్రమైన సందర్భాల్లో స్ట్రోక్ వంటి ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహారం పద్దతులు, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అజ్వైన్ నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి పెరగకుండా కంట్రోల్ చేయవచ్చు.

భారతీయ సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్లు. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, వ్యాధులపై పోరాడటానికి మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. అన్ని రకాల అనారోగ్యాలను నయం చేయడానికి పురాతన గృహ వైద్యం ఎంతో ఉపయోగం. అజ్వైన్ లేదా కరోమ్ సీడ్ (వాము) భారతీయ వంటగది నుండి వచ్చిన ఒక అద్భుతమైన మసాలా. దీనిని భారతీయులు ఎక్కువగా రసం వంటి వంటల తయారీలో ఉపయోగిస్తారు . అజ్వైన్‌లో థైమోల్ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన నూనె, ఇది మసాలా దినుసులకు ప్రత్యేకమైన రుచిని మరియు సుగంధాన్ని ఇస్తుంది. బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. హృదయనాళ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అజ్వైన్ యాంటీహైపర్ టెన్సివ్ లక్షణాలను కలిగి ఉంది. రోజువారీ ఆహారంలో అజ్వైన్‌ను చేర్చడం వల్ల రక్తపోటు అదుపులో ఉన్నందున అద్భుతాలు చేయవచ్చని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. దీనిని అలానే తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి, నీటిరూపంలో తీసుకోవడం మంచిది.

రక్తపోటును కంట్రోల్‌లో ఉంచేందుకు అజ్వైన్ నీటిని తయారుచేసే విధానం చాలా సులభమైన ప్రక్రియ. ఒక టీస్పూన్ వేయించిన వాముని తీసుకుని కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని అలాగే తాగేయొచ్చు లేదా వడకట్టి తాగొచ్చు. ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమం.

Tags

Read MoreRead Less
Next Story