మార్కెట్లోకి వస్తున్న మరో మంచి ఔషధం.. కరోనా రోగులకు ఉపశమనం

మార్కెట్లోకి వస్తున్న మరో మంచి ఔషధం.. కరోనా రోగులకు ఉపశమనం
ఈ సంవత్సరం అంతా ఇదే ముచ్చట. మరో మాట లేదు.. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్లు, వయసు తక్కువ ఉన్నవాళ్లు కోలుకున్నా.. చాలా మంది పెద్ద వయసు వారిని, శ్వాస సంబంధిత..

ఈ సంవత్సరం అంతా ఇదే ముచ్చట. మరో మాట లేదు.. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్లు, వయసు తక్కువ ఉన్నవాళ్లు కోలుకున్నా.. చాలా మంది పెద్ద వయసు వారిని, శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారిని కోవిడ్ పొట్టన పెట్టుకుంది. కోవిడ్ రోగులకు చికిత్స అందించే వైద్యులు సైతం మహమ్మారి కాటుకు బలయ్యారు. ఎందరో ప్రముఖుల చివరి చూపునకు నోచుకోనివ్వకుండా చేసింది మాయదారి మహమ్మారి. మామూలు వైరస్ లాంటిదే అని మనసుకు చెప్పుకుందామన్నా ఎన్నెన్ని వార్తలు.. ఏం చేస్తుందో ఏమో.. వైద్యుడి దగ్గరకు వెళితే ఏదో ఒక మందు ఇస్తారని కోవిడ్ రోగులు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఒకానొక దశలో ఆస్పత్రుల్లో బెడ్లు లేక హో క్వారంటైన్‌‌లో ఉండమంటూ జాగ్రత్తలు చెప్పారు వైద్యులు రోగుల తాకిడి తట్టుకోలేక. వైరస్ కొంత తగ్గుముఖం పట్టినా ఇంకా అక్కడక్కడా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం.

కొంత మందికి కోవిడ్ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. నెలల తరబడి అలసట, నొప్పులు, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. కొద్ది దూరం నడిచినా తీవ్రమైన అలసట వస్తోందని అంటున్నారు. శ్వాస అందకపోవడం, దగ్గు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, కంటిచూపు మందగించడం, వినికిడి సమస్యలు, తలనొప్పి, వాసన, రుచి తెలియకపోవడం, హృద్రోగ సమస్యలు, ఊపిరితిత్తులు, కిడ్నీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావడంతో పాటు మరి కొందరిలో ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయని చెబుతున్నారు.ఇంతవరకు కోవిడ్ సోకిన వారి ప్రాణాలు కాపాడడంపైనే దృష్టి పెట్టిన వైద్యులు ఇప్పుడు దీర్ఘకాలిక లక్షణాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా, కరోనా తీవ్రతను తగ్గించే మందులు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఔషధాల సంస్థలు రోగులకు ఉపశమనం కలిగించే మందులను తీసుకొస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చే లోపు మరణ రేటును తగ్గించే దిశగా వస్తున్న మందులు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. తాజాగా coronaid అనే ఔషధం మార్కెట్లోకి వచ్చింది. సామాన్యులకు సైతం ఈ ఔషధం అందుబాటులో ఉండే విధంగా ఈ మెడిసిన్ అందుబాటులో ఉంది. ఇక ఈ ఔషధం శరీరంలోని సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లోని సిలియాను సంరక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ ఔషధం.. ప్రాణాంతకమైన వైరస్‌లు, బ్యాక్టీరియాల గురించి పరిశోధన చేసే సంస్థ CCMB ఆమోద ముద్ర పొందింది. coronaidకి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్‌గా NuZen సంస్థ వ్యవహరించడం పట్ల సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story