Belly Fat Control:పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గేందుకు మార్గాలు..

Belly Fat Control:పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గేందుకు మార్గాలు..

Belly Fat Control:

Belly Fat Control: ఈ విషయంలో ఏ మాత్రం బద్దకం వహించినా బరువు పెరిగిన తరువాత తగ్గడం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే తగినంత శ్రద్ద పెట్టడం ఎంతైనా అవసరం

ఉదయం సాయింత్రం పార్కు చుట్టూ రౌండ్లు వేసినా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగట్లేదని పొట్టని తడుముకుంటూ బాధ పడుతుంటారు చాలా మంది. ఆరోగ్య అలవాట్లు కూడా ఊబకాయాన్ని తీసుకువస్తుంది. అనవసర బరువు అనారోగ్యానికి దారితీస్తుంది. గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీపీ, డయాబెటిస్ వంటివి సరేసరి. ఎవరికి వారికి బరువు పెరిగిన విషయం వెంటనే అర్థమవుతుంది. ఏ మాత్రం అశ్రద్ద చేయకుండా తగ్గించుకోవడం ప్రారంభించాలి. సరైన ఆహారపు అలవాట్లతో పాటు, చిన్నపాటి వ్యాయామం కూడా ఎంతో అవసరం. ఈ విషయంలో ఏ మాత్రం బద్దకం వహించినా బరువు పెరిగిన తరువాత తగ్గడం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే తగినంత శ్రద్ద పెట్టడం ఎంతైనా అవసరం. బరువు తగ్గేందుకు ప్రతి రోజు తప్పని సరిగా పాటించవలసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాటిని ఆచరణలో పెడదాం.

1. నీటితో రోజు ప్రారంభించండి

బెడ్ మీద నుంచి లేచిన వెంటనే వంట గదిలోకి వెళ్ళి గ్లాసు నీరు గోరు వెచ్చగా చేసుకుని తాగండి. శరీరం హైడ్రేటెడ్‌గా మారడమే కాకుండా, మీ శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించే శక్తి గోరు వెచ్చని నీటికి ఉంటుంది. రాత్రంతా ఉపవాసం తర్వాత రీహైడ్రేట్ చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. నీరు ఆకలిని కూడా అరికడుతుంది.

2. మినీ కోర్ వర్కౌట్ సెషన్

ప్రతి ఒక్కరూ ఉదయం వ్యాయామం చేయడానికి సమయం లేదని భావిస్తారు. కానీ తప్పదు. పొట్టకు సంబంధించిన వర్కవుట్లు కనీసం ఓ 20 నిమిషాలైనా చేయాలి. ఇది మీ కండరాలను టోన్ చేయడానికి మరియు బొడ్డు ప్రాంతంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. పొట్టకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు నేర్చుకుని రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.

3. కార్డియో వ్యాయామంతో తీవ్రతను పెంచుకోండి

మీకు ఉదయం ఎక్కువ సమయం ఉంటే, మీ బొడ్డు కొవ్వును అధిక గేర్‌లో ఉంచడానికి వారానికి కొన్ని సార్లు కార్డియో వ్యాయామం మీ ఉదయం దినచర్యకు జోడించడానికి ప్రయత్నించండి.

ట్రెడ్‌మిల్‌పై నడవడం బోరింగ్‌గా ఉంటే ప్రముఖులు అందించిన కార్డియో వర్కౌట్స్ ఉంటాయి. అవి ఓ 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది.

బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడానికి హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) కూడా చాలా బాగుంది. దీనితో ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. సమయం కూడా తక్కువగా పడుతుంది.

4. ప్రోబయోటిక్ తీసుకోండి

ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ బొడ్డు ప్రాంతంలో పేరుకున్న కొవ్వును తొలగించడానికి సహాయపడతాయి.

ఈ ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.

5. గ్రీన్ టీ

గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగేవారి శరీర కొవ్వును తగ్గిస్తాయి. ముఖ్యంగా ఉదర ప్రాంతంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.

6 అల్పాహారం తీసుకోవడం మానవద్దు

బరువు తగ్గాలని అల్పాహారం మానకూడదు. అలా చేయడం వల్ల మీరు తక్కువ తింటున్నట్లు మీకు అనిపించినప్పటికీ ఒక రోజులో ఎక్కువ కేలరీలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో కొవ్వు కరగడం కష్టతరం అవుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ మంచి అల్పాహారం. ఉడికించిన గుడ్లలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు.

7. ఫైబర్ మరియు ప్రోటీన్‌తో అల్పాహారం

ఆకుకూరలతో చేసిన ఆమ్లెట్, వోట్స్, చిలగడదుంపలు వంటి వాటి నుండి శరీరానికి కావలసిన ఫైబర్‌ అందుతుంది.

ప్రోటీన్ నిండిన ఆహారాలలో గుడ్లు, పెరుగు, వేరుశెనగ, బాదం, బటర్ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story