అరటి పండ్లు.. ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రమాదాలు

అరటి పండ్లు.. ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రమాదాలు
అయితే చక్కెర శాతం అధికంగా ఉంటుందని అరటిపండ్లను తినడానికి డయాబెటిక్ ఉన్నవారు భయపడుతుంటారు.

అరటి పండు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. పుట్టిన పాపాయికి అన్నం పెట్టక ముందు నుంచే అరటి పండు అలవాటు చేస్తుంది అమ్మ. జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు అరటి పండు తోడ్పడుతుంది. నీరసంగా అనిపించినప్పుడు ఓ అరటి పండు తింటే శక్తి వస్తుంది. అందుకే దాదాపు ప్రతి ఇంట్లో ఏ పండు ఉన్నా లేకపోయినా అరటి పండ్లు మాత్రం ఉంటాయి. మిగతా పండ్లతో పోలిస్తే అరటి పండ్లు కొంచెం చవకైనవనే చెప్పాలి. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే అరటిపండు వైపే చూస్తారు పూజారులు.

అరటి పండులో ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది. ఒక వ్యక్తి యొక్క రోజువారీ పొటాషియం అవసరాలలో దాదాపు 9% అరటి అందిస్తుంది. అరటిలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

అరటిపండ్లలో ఉన్న లెక్టిన్ అనే ప్రోటీన్ లుకేమియా కణాలు పెరగకుండా నిరోధిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. లుకేమియా కణాలు క్యాన్సర్ కారకాలు. లెక్టిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ అని పిలవబడే అణువులను తొలగించడానికి సహాయపడతాయి. ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ఏర్పడితే, కణాల నష్టం సంభవించవచ్చు. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుంది.



అరటిపండ్లు, నారింజ రసం లేదా రెండింటినీ తినే పిల్లలకు లుకేమియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఫైబర్ తక్కువగా తీసుకునే వారికి గుండెకు సంబంధించిన వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇక ఫైబర్ ఎక్కువగా తీసుకునే వారికి లిపో ప్రొటీన్ (ఎల్‌డీఎల్) లేదా చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది.

అయితే చక్కెర శాతం అధికంగా ఉంటుందని అరటిపండ్లను తినడానికి డయాబెటిక్ ఉన్నవారు భయపడుతుంటారు. ఫైబర్ తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలు తేల్చాయి. అధిక ఫైబర్ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అతిసారంతో బాధపడుతున్న వారికి అరటి పండు తినమని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. అతిసార వ్యాధి గ్రస్తులకు నీరు, పొటాషియం వంటి వాటిని శరీరం అధిక మొత్తంలో కోల్పోతుంది. అరటి పండ్లు ఈ పోషకాలను భర్తీ చేయగలవు.

అధిక ఫైబర్ ఆహారాలు ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి ఉన్నవారిలో ఉబ్బరం, కడుపులో గ్యాస్ లక్షణాలను ప్రేరేపిస్తాయి. అరటిపండ్లు ఈ లక్షణాలను మెరుగుపరుస్తాయి. అమెరికాలోని న్యూట్రిషన్ ఫౌండేషన్ వారు స్నాక్స్‌లో ఆహారంగా అరటి పండును సిఫారసు చేస్తారు.

అరటి పండు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని నియంత్రిస్తుంది. పొటాషియం కండరాలను సంకోచించడానికి మరియు నాడీ కణాలు ప్రతిస్పందించడానికి సహాయపడుతుంది. ఇది గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. రక్తపోటుపై సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది.

అరటి పండులో ఉంటే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు పొటాషియం సరైన మోతాదులో ఉండేలా చూస్తాయి. ఒక మీడియం సైజు అరటి పండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అందుకే రోజువారి ఆహారంలో అరటి పండును చేర్చడం ఎంతైనా అవసరం.

అయితే అరటి పండుతో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

మంచివి కదా అని అదే పనిగా ఎక్కువ అరటి పండ్లు తీసుకోకూడదు. రోజుకు ఒకటి మించి తినకపోవడమే మంచిది. .

బీటా-బ్లాకర్స్ : హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యులు తరచూ ఈ మందులను సూచిస్తారు. బీటా-బ్లాకర్స్ రక్తంలో పొటాషియం స్థాయిని పెంచుతాయి.

పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని వారికి హానికరం. మూత్రపిండాలు రక్తం నుండి అదనపు పొటాషియంను తొలగించలేకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు. బీటా-బ్లాకర్లను ఉపయోగించేవారు అరటి వంటి అధిక పొటాషియం కలిగిన ఆహారాలను మితంగా తినాలి.

అలెర్జీ : కొంతమందికి చర్మ సంబంధిత సమస్యలు ఉంటాయి. దురద, దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారు ఎవరైనా ఒకసారి వైద్య సహాయం తీసుకొని అరటి పండును తినాలి.

మైగ్రేన్ : తీవ్రమైన తలపోటు ఉన్న వారు వైద్యుల సలహా మేరకు అరటి పండు తీసుకోవాలి.

అరటిపండ్లు ఒక ప్రసిద్ధ పండు, ఇది ఒక వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. అరటిలోని పోషకాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి, వ్యాధులను నివారించగలవు, అరటిపండు తినడం ప్రతి ఒక్కరిపై ఒకే ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఏదేమైనా, తాజా పండ్లు మరియు కూరగాయలు ప్రతి రోజు తీసుకున్న వ్యక్తుల జీవన విధానం మెరుగ్గా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story