Plum Fruit: చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన పండు ఇదే..

Plum Fruit (tv5news.in)

Plum Fruit (tv5news.in)

Plum Fruit: శరీరానికి ఆరోగ్యాన్ని అందజేసే ఆహారాల్లో పండ్లు కూడా ఒకటి.

Plum Fruit: శరీరానికి ఆరోగ్యాన్ని అందజేసే ఆహారాల్లో పండ్లు కూడా ఒకటి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒమిక్రాన్ లాంటి వైరస్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నందుకు ఈ చలికాలంలో పలు జాగ్రత్తలు పాటించడం ఎంతైనా ముఖ్యం. ఈ సీజన్‌లో శరీరానికి మేలు చేసేవే రేగి పళ్లు.

చలికాలంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు సహజం. అయితే ఈ కాలంలో ఈ సమస్యల నుండి రక్షించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల్లో రేగి పళ్లు కూడా ఒకటి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ పండ్లు ముందుంటాయి. వీటిల్లో విటమిన్ సి, ఏ పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కొందరు పెద్ద రేగిపండ్లను తొక్క తీసి తింటుంటారు. తొక్కతో పాటూ తినడం వల్ల కాలేయానికి చాలా మంచిది.

జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా రేగిపండ్లు కీలక పాత్రనే పోషిస్తాయి. రేగుపండ్లు తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగడం కోసం, రక్తం ఉత్పత్తిని వృద్ధి చేయడం కోసం రేగుపండ్లు ఉపయోగపడతాయి. రేగుపళ్లు చెడు కొవ్వును కరిగించడమే కాకుండా ఆకలిని పెంచుతాయి కూడా. చలికాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రేగుపండ్లు శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి.

మల్లబద్దకం ఉన్నవారికి రేగిపండు మరీ మంచిది. రోజూ తింటే ఆ సమస్య చాలావరకు తగ్గుతుంది. శారీరిక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా రేగుపండ్లు ఉపయోగపడతాయి. రేగిపండ్లలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా రేగుపండ్లు బెస్ట్. చర్మంపై ముగతలను పోగొట్టి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి రేగుపండ్లు.

Tags

Read MoreRead Less
Next Story