వర్షాకాలంలో మీరు ధరించే చెప్పుల నుంచి దుర్వాసన వస్తుందా? ఇవి ట్రై చేయండి

Footwear in Moonsoon

Footwear  

Footwear Tips: ఇక వర్షాలకు తడిస్తే మీ చెప్పులు పీల్చుకున్న నీళ్లు అంత తొందరగా ఆరిపోదు. దీంతో వాటిలో పాదరక్షకాల్లో సూక్ష్మజీవులు నివాసం ఏర్పరుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Footwear Tips: వర్షాకాలం కూడా ప్రారంభమైంది. ఈ కాలంలో అందరూ కొంత ఉల్లాసంగా గడుపుతారు. అంతేకాదు చిన్నపిల్లలైతే కాగితపు పడవలు చేస్తూ కేరింతలు పెడుతూ ఉత్సాహంగా గడుపుతారు. ఇక కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ముగియడంతో అందరూ వారివారి పనుల్లో బీజీగా ఉంటారు. అయితే వర్షాకాలంలో మీ కాళ్లకు ధరించే పాదరక్షలపై కొంచెం దృష్టి పెట్టాలి. బూట్లు, చెప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి వర్షం నీటికి తడిస్తే.. నీటిని పీల్చుకుంటాయి. దీంతో మీరు నడవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ కాళ్లకు రక్షణతో పాటు అందంగా.. కంఫర్ట్ గా ఉండేలా చూసుకుంటే ఎంతో మంచిది.

వర్షాకాలంలో మీరు వేసుకునే చెప్పులు, షూస్ లలో కొన్ని రకాలు తడిస్తే.. అవి ఆరేందుకు చాలా సమయం పడుతుంది. అంతేకాదు అవి ఆరేందుకు చాలా సమయం పడుతుంది. అప్పుడు వాటి నుండి దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు వాటిని వేసుకుని ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటర్ ప్రూఫ్ రకాలు.. ముఖ్యంగా తేలికగా ఉండే మన్నికైన పాదరక్షలను తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన వాటిని చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.

ఇక వర్షాలకు తడిస్తే మీ చెప్పులు పీల్చుకున్న నీళ్లు అంత తొందరగా ఆరిపోదు. దీంతో వాటిలో పాదరక్షకాల్లో సూక్ష్మజీవులు నివాసం ఏర్పరుచుకునే అవకాశాలు ఉన్నాయి. నీళ్లు పీల్చుకున్న చెప్పులు, బూట్లు ధరించడం వల్ల చాలా బరువుగా ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో మీరు చెప్పులు, బూట్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు వర్షాకాలంలో ట్రెండ్ కు తగ్గట్టు లేటెస్ట్ ఫుట్ వేర్ తప్పనిసరిగా ధరించండి. ఈ సందర్భంగా వర్షకాలంలో ఎలాంటి పాదరక్షలు ధరిస్తే బెటర్ అనేది తెలుసుకుందాం.


రబ్బరు సోల్ ఉండే పాదరక్షలను ఎంచుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇందులో కూడా నీరు ఎక్కువగా నిల్వ ఉండదు. వర్షకాలంలో చాలా కంఫర్ట్ గా ఉండే పాదరక్షలలో శాండిల్స్ ఒకటి.. వీటిని మీరు ధరిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు నడవడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకా ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. అంతేకాదు ఒక వేళ నీటిని పీల్చుకున్నా త్వరగా ఆరిపోతాయి. స్ట్రాప్స్ ను పెట్టి తీయడం కూడా చాలా సులభం.


లైట్ వెయిట్ ట్రావెల్ ఫ్రెండ్లీ క్లాగ్స్.. ఈ రకమైన పాదరక్షలలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. చాలా లైట్ వెయిట్ తో ఉంటాయి. పైగా వీటిలో ఎక్కువగా వాటర్ ప్రూఫ్ గా ఉంటాయి. మీరు వర్షాకాలంలో వీటిని వేసుకుని నడవడానికి చాలా కంఫర్ట్ ఫీలవుతారు.



ఈ వర్షాకాలంలో చాలా మంది ఫ్లిప్ ఫ్లాప్స్ నే ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ రకమైన పాదరక్షలలో ఎక్కువ నీరు నిలిచి ఉండవు. ఇవి బాగా స్టైలీష్ గా కూడా ఉంటాయి. సెలబ్రెటీలు వర్షాకాలంలో ఈ రకమైన పాదరక్షలనే వేసుకుంటారు. సో తెలుసుకున్నారుగా వర్షాకాలంలో మీరు ఎలాంటి పాదరక్షలు ధరించాలలో ఇంక ఎందుకు లేట్ వెంటనే ట్రై చేయండి.

Tags

Read MoreRead Less
Next Story