Covid Symptoms: అశ్రద్ధ చేస్తే అనర్ధాలు: నిపుణులు హెచ్చరిక

Covid Symptoms: అశ్రద్ధ చేస్తే అనర్ధాలు: నిపుణులు హెచ్చరిక
అయితే ఈ లక్షణాలు మందులు వాడుతున్నా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు.

Covid Symptoms: దగ్గు, జలుబు, జ్వరం ఇవన్నీ కోవిడ్ లక్షణాలే. వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారు. అయితే ఈ లక్షణాలు మందులు వాడుతున్నా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు.

ఆలస్యం చేసిన కొద్దీ ఊపిరితిత్తులలోకి వైరస్ వెళ్లిపోయి తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. దీంతో బాధితుడ్ని సాధారణ స్థితికి తీసుకు రావడం వైద్యులకు కష్టమవుతుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

లక్షణాలు కనిపించిన మొదటి వారం రోజులు చాలా కీలకమని వైద్యులు స్ఫష్టం చేస్తున్నారు. మందులు వాడుతున్నా జ్వరం 101-102 డిగ్రీలు దాటుతుంటే 5 రోజుల వరకు ఆగకూడదని నిపుణులు చెబుతున్నారు. వరుసగా మూడు రోజులు జ్వరం తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

30 శాతం మంది 30-50 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. తమకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని భావించి కోవిడ్ వచ్చి వారం రోజులైనా ఇళ్లలోనే ఉంటున్నారు. దాంతో వ్యాధి తీవ్రత ముదిరిపోతోంది. ఆ సమయంలో చికిత్స అందించడం కష్టంగా మారుతుంది. దాంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో మహిళల కంటే పురుషుల్లోనే తీవ్రత అధికంగా కనిపిస్తోంది.

వైద్యుని ఎప్పుడు సంప్రదించాలి..

5 రోజులు గడుస్తున్నా లక్షణాలు తగ్గుముఖం పట్టనప్పుడు వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. వీరిలో రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే ఎక్కువగా ఉన్నా సరే ఆసుపత్రిలో చేరాల్సిందే.

ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 5-6 గంటల వ్యవధిలో ఐదు వేళ్లకూ వేర్వేరు సమయాల్లో పల్స్ ఆక్సిమీటర్ తో పరీక్షించాలి. కనీసం 2-3 నిమిషాలు ఉంచాలి.

అయితే ఏ వేలికి పెట్టినా 92 కంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుందని గుర్తిస్తే ఆస్పత్రిలో చేర్పించాలి.

ఒకవేళ తొలి 5-6 రోజుల్లో రక్తంలో ఆక్సిజన్ శాతం సరిగానే ఉన్నా 7-8 రోజుల్లో లెవెల్స్ పడిపోయే అవకాశాలున్నాయి.

8-13 రోజుల్లోనే శ్వాసకోశ నాళాలు దెబ్బతింటున్నాయని సీనియర్ డాక్టర్లు వివరిస్తున్నారు.

కోవిడ్ మొదటి దశలో 7 రోజుల తర్వాత కనిపించే తీవ్రత ఇప్పుడు 5 రోజులకే కనిపిస్తోంది. మొదటి వారంలో లక్షణాలు మాత్రమే కనిపించి రెండో వారానికి ఆ లక్షణాల తీవ్రత బయటపడుతోంది.

కోవిడ్ వ్యాధి లక్షణాలు కనిపించిన 5 రోజుల్లోపు సీటీ స్కాన్ చేయించకూడదు. 6 రోజుల తరువాత చేయిస్తే మంచిది.

Tags

Read MoreRead Less
Next Story