పొట్ట తగ్గేదెలా.. తినకూడని పదార్థాలేవో తెలిస్తే..

పొట్ట తగ్గేదెలా.. తినకూడని పదార్థాలేవో తెలిస్తే..
తీసుకునే ఆహార పదార్థాలు కూడా పొట్ట పెరగడానికి కారణమవుతాయి. వాటిల్లో ఉన్న గ్యాస్ వలన పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.

ఎక్సర్‌సైజులు చేస్తున్నా పొట్ట తగ్గట్లేదు.. ఎందుకో తెలియదు.. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని తమ ప్రమేయం లేకుండా పెరుగుతున్న పొట్టను చూసి బాధపడేవాళ్లు చాలా మంది ఉంటారు. తీసుకునే ఆహార పదార్థాలు కూడా పొట్ట పెరగడానికి కారణమవుతాయి. వాటిల్లో ఉన్న గ్యాస్ వలన పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.

చెమటలు పట్టేలా కష్టపడుతున్నా బరువు తగ్గే సూచనలేవీ కనిపించట్లేదు అని వాపోతుంటారు.

పోషకాహార నిపుణులు శరీరంలో గ్యాస్, ఉబ్బరం కలిగించే ఆహార పదార్థాలను నివారించాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు, పుచ్చకాయ, ధాన్యాలు, కొన్ని పాల ఉత్పత్తులు వాయువుకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలంటే వాటన్నింటిని దూరం పెట్టాలి.

వీటిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తగ్గిస్తే మీ శరీరాకృతి మీరు కోరుకున్న విధంగా ఉంటుందని అంటున్నారు. పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని తింటే అవి కూడా పొట్ట పెరగడానికి కారణమవుతాయి. మరి అలాంటి ఆహార పదార్థాల జాబితా ఏంటో ఒకసారి చూద్దాం.

1. చిక్కుళ్ళు

ఆరోగ్యానికి మంచి చేసే కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి. అయితే, శరీరంలో గ్యాస్, ఉబ్బరం కలిగించేవి మరికొన్ని ఉన్నాయి. బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు మరియు సోయాబీన్స్ వంటి చిక్కుళ్ళలో అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. దాంతో వాటిని మన ఆహారంలో చేర్చుకున్నప్పుడు పొట్టలో గ్యాస్ పెరిగి పొట్ట ఉబ్బుగా కనిపిస్తుంది.



2. పెరుగు

జీర్ణక్రియ ప్రక్రియను నియంత్రించడానికి ప్రోబయోటిక్స్ ఉన్నందున పెరుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచిది. అయితే మార్కెట్లో దొరికే రుచిగల యోగర్ట్స్‌లోచక్కెర అధికంగా ఉన్నందున దాన్ని తినడం మానుకోవాలి. ఇది గ్యాస్ మరియు ఉబ్బరం కలిగిస్తుంది.

3. ధాన్యాలు

గోధుమ వంటి ధాన్యాలలో 'ఫ్రూక్టాన్' అనే కార్బ్ ఉంటుంది. ఇది జీర్ణం కావడం కష్టం

4. పుచ్చకాయలు

పుచ్చకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులో వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయను కోసి ఫ్రిజ్లో పెట్టుకుని తింటే కడుపులో చల్లగా ఉంటుంది అని అందరూ దీన్ని తినడానికి ఆసక్తి చూపుతారు. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో ఒకటి. అయితే పుచ్చకాయలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర ఉన్నందున ఉబ్బరం కలుగుతుందని పరిశోధన చెబుతుంది.

5. ఉల్లిపాయలు

ఉల్లిపాయలలో ధాన్యాలలో కనిపించే పిండి పదార్థాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోవచ్చు. ఉల్లిపాయలలో 'ఫ్రూక్టాన్' కూడా ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టం కాదు, కానీ పేగులో నీటి నిల్వకు కారణమవుతుంది.

6. పాలు

ప్రతి ఇంటిలో పాలు ఒక ముఖ్యమైన వస్తువు, అయితే, పాల ఉత్పత్తులైన జున్ను, పాలకోవా వంటి వాటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది, ఇవి అధిక పరిమాణంలో తీసుకున్నప్పుడు జీర్ణక్రియ సమస్య తలెత్తుతుంది.

7. బ్రోకలీ, కాలే, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫరస్ కూరగాయలు

బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు, కాలే వంటి క్రూసిఫరస్ కూరగాయలు 'రాఫినోజ్' ను కలిగి ఉంటాయి. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది పొట్టలో వాయువుని, ఉబ్బరాన్ని కలిగిస్తుంది.



8. యాపిల్స్

ఆపిల్ ప్రతి ఇంటిలో వాడే ఒక సాధారణమైన పండు. అయినప్పటికీ, ఫైబర్, ఫ్రక్టోజ్, సార్బిటాల్ ఉండటం వలన జీర్ణక్రియకు ఆటంకంగా మారుతుంది. ముఖ్యంగా ఆపిల్‌ను రాత్రి పూట తీసుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.

9. కృత్రిమ స్వీటెనర్

చాలామంది చక్కెర నుండి కృత్రిమ స్వీటెనర్లకు మారతారు, కాని అవి జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయని తెలియదు, ఇది కూడా ఉబ్బరంకు దారితీస్తుంది.





Tags

Read MoreRead Less
Next Story