'తిప్పతీగ' తప్పక తినాలి.. ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుసా..

తిప్పతీగ తప్పక తినాలి.. ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుసా..
తిప్పతీగ. దీనిలో ఉన్న ఔషధ గుణాలు అంటువ్యాధులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

కరోనా వైరస్.. ఆయుర్వేద అంశాలను ఎన్నింటినో వెలుగులోకి తెచ్చింది. వైరస్ ప్రభావంతో ప్రతి ఇల్లూ ఒక ఆయుర్వేద వైద్యశాలగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆయుర్వేదంలో ఉండే రకరకాల మూలికలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని పరిశోధనల్లో తేలింది. అందులో ఒకటి తిప్పతీగ. దీనిలో ఉన్న ఔషధ గుణాలు అంటువ్యాధులను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

ప్రతి రోజు రెండు ఆకులు తినడం అలవాటు చేసుకుంటే క్రమేపీ కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

తిప్పతీగ ఎముకల్లో ఖనిజ శక్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎముకల వ్యాధులను నివారిస్తుంది.

కాలేయాన్ని రక్షిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను నిర్వీర్యం చేయడానికి కాలేయానికి మద్దతు ఇస్తుంది.

తిప్పతీగలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. తత్పలితంగా హృదయ కండరాల పని తీరు మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది.

న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

తిప్పతీగ మధుమేహనివారిణి.. ఇది క్లోమం నుండి ఇన్సులిన్ స్రావం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

దీర్ఘకాలిక శ్వాస కోశ సమస్యలను నివారిస్తుంది. దీనిలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శ్వాస కోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి వాటినుంచి కాపాడుతుంది.

తిప్పతీగ యాంటీ ఏజింగ్ హెర్బ్.. ఇది కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కణాల నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే తిప్ప తీగ చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. వృద్ధాప్య సంకేతాలు తగ్గించి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

Tags

Read MoreRead Less
Next Story