వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ పని చేయండి..!

వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ పని చేయండి..!
వర్షాకాలం మొదలైంది. ఇక వర్షాలు రోజూ పడుతూనే ఉంటాయి. అయితే ఈ సమయంలో బట్టలు ఎండడం అనేది చాలా కష్టం అవుతుంది.

వర్షాకాలం మొదలైంది. ఇక వర్షాలు రోజూ పడుతూనే ఉంటాయి. అయితే ఈ సమయంలో బట్టలు ఎండడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉతికిన బట్టల్ని ఆరేస్తుంటారు. అయితే ఆ దుస్తులు సరిగ్గా ఆరక వాటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీనితో ఇల్లంతా అదే వాసన నిండిపోతుంది.

అయితే బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సరిగ్గా ఆరని దుస్తుల నుంచి వచ్చే దుర్వాసనను నిమ్మరసంతో దూరం చేసుకోవచ్చు. ముందుగా ఓ స్ప్రై బాటిల్ లో కాస్తా నిమ్మరసంతో నింపుకోవాలి. ఆ తర్వాత వాసన వచ్చే దుస్తులపై ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసి కాసేపు అలాగే గాలిలో ఆరేయాలి.

వెనిగర్ అలాగే బేకింగ్ సోడా అనేది బట్టల నుంచి వచ్చే దుర్వాసనను తొలగించేస్తాయి. కాబట్టి, బట్టలను ఉతికేటప్పుడు కాస్తంత వినేగార్ ను అలాగే బేకింగ్ సోడా ను డిటర్జెంట్ లో కలిపితే చెడు వాసన రాదు. అలాగే బట్టలను ఉతికే ముందు చాలా సేపు నానాబెట్టడం, తడిసిన దుస్తుల్ని ఉతకకుండా అలాగే పక్కన పెట్టడం, బట్టలను ఉతికేశాక ఎక్కువసేపు వాటిని ఆరబెట్టకుండా అలాగే ఉంచడం వలన కూడా బట్టల నుంచి దుర్వాసన వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story