Garlic-Honey: ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఇంటి వైద్యం.. తేనె, వెల్లుల్లి కలిపి..

Garlic-Honey: ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఇంటి వైద్యం.. తేనె, వెల్లుల్లి కలిపి..
కరోనా సీజన్ లోనే కాదు.. ఎప్పుడైనా శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం.

Garlic-Honey: కరోనా సీజన్ లోనే కాదు.. ఎప్పుడైనా శరీరానికి రోగ నిరోధక శక్తి చాలా అవసరం. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు, శరీరం త్వరగా రోగాల బారిన పడకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) చాలా అవసరం.

కూరల్లో వాడే వెల్లుల్లి ఆహారానికి రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. దానికి ప్రతిరోజు తేనె జోడించి తీసుకుంటే శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ అందుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తినాలో చూద్దాం..

వెల్లుల్లిలో ముఖ్యమైన పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. యుగయుగాలుగా సాంప్రదాయ వైద్యంలో వెల్లుల్లి ఒక భాగంగా ఉంది. అనేక మంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలని సిఫార్సు చేస్తున్నారు.

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

వెల్లుల్లి తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు జలుబుకు సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడింది. తేనెతో కలిపినప్పుడు దీని ప్రయోజనాలు తక్షణమే రెట్టింపు అవుతాయి.

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి "జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ పనితీరు, రోగనిరోధక శక్తి జీర్ణవ్యవస్థకు చాలా మంచిది.

తేనెలో వెల్లుల్లిని ఎలా నానబెట్టాలి..

మొదటగా వెల్లుల్లి పై పొట్టు తీసి రెండు ముక్కలు చేయాలి.

గాలి చొరబడని గట్టి గాజు కూజాలో వెల్లుల్లి ముక్కలు వేయాలి. ముక్కలు మునిగేంత వరకు తేనె పోయాలి.

ఒక వారం రోజుల పాటు అలానే వదిలేయాలి.

ఆ తరువాత కడుపులో మంట లాంటి అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోతే పరగడుపున ఓ అరస్పూన్ ముక్కలు తేనెతో పాటు తీసుకోవాలి. లేదంటే అల్పాహారం తీసుకున్న తరువాత తినొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story