రాజ్‌మా రాళ్లను కరిగిస్తుందా.. ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు..

రాజ్‌మా రాళ్లను కరిగిస్తుందా.. ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు..
పేరులో 'కిడ్నీ' అనే పదంతో పాటు రాజ్‌మా గింజలు కూడా కిడ్నీ ఆకారంలో ఉన్నందున కిడ్నీలకు

మూత్రపిండాల రాళ్లను నయం చేయడంలో కిడ్నీ బీన్స్ (హిందీలో రాజ్‌మా) ఎలా సహాయపడుతుంది?మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఇవి సహాయపడతాయా లేదా అనేది తెలుసుకుందాం..

మూత్రపిండాల్లో రాళ్లను నయం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పేరులో 'కిడ్నీ' అనే పదంతో పాటు రాజ్‌మా గింజలు కూడా కిడ్నీ ఆకారంలో ఉన్నందున కిడ్నీలకు ప్రయోజనకారిగా ఉంటుందని అందరూ అపోహపడుతుంటారు.

కిడ్నీ బీన్స్ కంటే భారతీయులకు రాజ్మా బాగా పరిచయం ఉన్న పదం. కిడ్నీ బీన్స్ మూత్రపిండాల సమస్యలకు ప్రత్యేకమైన నివారణ కాదు.

రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ రకరకాల పప్పుధాన్యాలు. ఇవి ప్రోటీన్, ఫైబర్‌తో పాటు కొన్ని సూక్ష్మ పోషకాలను సరఫరా చేయగలవు. ఆ విధంగా అవి శరీరానికి కావలసిన ఇతర పప్పుధాన్యాల మాదిరిగా సహాయపడతాయి. కిడ్నీ బీన్స్ కిడ్నీ రాళ్లకు ప్రత్యేకమైన నివారణ అని చూపించడానికి ఇప్పటివరకు ప్రామాణికమైన పరిశోధనా పత్రం లేదు. వాస్తవానికి వినియోగం కంటే రాజ్‌మాను అతిగా వాడడం వలన కొన్ని సమస్యలు వస్తాయి.



కిడ్నీలో రాళ్ళు ఆక్సలేట్ ఏర్పడటం వల్ల కలుగుతాయి. ఆక్సలేట్లను కరిగించి, మూత్రం ద్వారా సజావుగా బయటకు పంపించడానికి సహాయపడే ఆహారం, మందులు. అందువల్ల తగినంత నీరు తీసుకోవలసిన అవసరం ఉంది. ఆక్సలేట్ సహకారం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం.

కిడ్నీ సమస్య నివారణ కోసం ఫ్రెంచ్ బీన్స్ (సాధారణంగా భారతదేశం అంతటా ఏదైనా కూరగాయల దుకాణంలో లభిస్తుంది) ఉపయోగించవచ్చు. లేతగా, ఫ్రెష్‌గా ఉన్న ఫ్రెంచ్ బీన్స్ ఓ కప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఉడకపెట్టాలి. వీటిని చిటికెడు ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని స్నాక్స్‌లాగా తీసుకోవచ్చు. ఇలా రోజూ చేస్తూ దాంతో పాటు రోజుకు 2-3 లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగాలి. ఎక్కువ నీటి వినియోగం వల్ల నొప్పి నుండి ఉపశమనంతో పాటు రాయి కరిగిపోయే అవకాశాలు ఎక్కువ.

ఇది ఎలా చెయ్యాలి? 250 నుండి 300 గ్రాముల ఫ్రెంచ్ బీన్స్ కొనండి మరియు దాని విత్తనాన్ని తొలగించి శుభ్రం చేయండి. మెత్తగా అయ్యేవరకు అరగంట కన్నా ఎక్కువసేపు ఈ పద్ధతిలో కిడ్నీ రాయి 24 గంటల్లో తొలగించబడుతుంది. ఇది ఒక చక్కని చిట్కా.

నీరు తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు నీరు త్రాగాలి. ముఖ్యంగా వేడి రోజులలో శరీర నీటి స్థాయిని కాపాడుకునే పండ్లను తినడానికి ప్రయత్నించాలి. అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు నియంత్రించడానికి కూడా ప్రయత్నించవద్దు. కిడ్నీ బీన్స్ తినడం వల్ల కిడ్నీ రాళ్ల సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మీరు స్వంత వైద్యుడిగా మారి ప్రయోగాలు చేయకూడదు.. మూత్రపిండాల రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటే మంచి వైద్యుడిని సంప్రదించండం ఎంతైనా అవసరం.

Tags

Read MoreRead Less
Next Story