వానలు పడే సమయంలో వారంలో ఒకసారైనా ఇవి తినాలి..

వానలు పడే సమయంలో వారంలో ఒకసారైనా ఇవి తినాలి..
Monsoon Session: వర్షాకాలం వచ్చిందటే చాలు చాలా మంది వేడి వేడి టీ, విర్చిబజ్జి, మొక్కజొన్న పొత్తులు ఇలా అనేక రకాలు వంటకాలను ఆరగించాలని చూస్తారు.

వర్షాకాలం వచ్చిందటే చాలు చాలా మంది వేడి వేడి టీ, విర్చిబజ్జి, మొక్కజొన్న పొత్తులు ఇలా అనేక రకాలు వంటకాలను ఆరగించాలని చూస్తారు. ప్రతి ఒక్కరూ తమ డైట్ పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వానా కాలంలో ఎక్కువ కూరగాయలు, గింజలు వంటివి తీసుకుంటూ ఉండాలని న్యూట్రీషనిస్ట్లు చెబుతున్నారు. వానలు పడే సమయంలో కచ్చితంగా తినాల్సిన ఫుడ్ ఒకటి ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం.

వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలి:

*ఉడికించిన పల్లీలు,

*నానబెట్టిన లేదా ఉడికించిన పప్పు

*మొక్కజొన్న

*వేర్లుతో పండే కూరగాయలు

*కీరదోస, గుమ్మడి మరియు ఇతర తీగల కూరగాయలు

వానలు పడుతుంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది అందుకని బజ్జీ లేదా పకోడీ ఒకసారి తీసుకోవచ్చు. నెలలో ఒకసారి ఖచ్చితంగా వాము వాడండి. పుట్టగొడుగులు,అప్పటికప్పుడు తయారు చేసుకున్న పచ్చళ్ళు లేదా నిల్వ ఉండే పచ్చళ్ళు తినాలి. కుడుములు కూడా తీసుకోవాలంట. ఎక్కువగా వినాయక చవితికి మోదకాలు తయారు చేస్తారు. పైగా ఎంతో సింపుల్ గా మనం ఈ రెసిపీని చేసేయచ్చు.

గోంగూర

కందిపప్పు

ఆవాలు

జీలకర్ర

ఇంగువ

చామదుంపలు

కారం

పసుపు

ఉప్పు

నూనె

చామదుంపల వేపుడు చేసుకొని తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు కారం కూడా తగినంత తీసుకోవాలని పేర్కొంటున్నారు. గోంగూర కూడా మీ డైట్ లో ఉండాలని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story