National Parents Day 2023: తల్లిదండ్రులను ఆర్థికంగా సురక్షితంగా ఉంచే బహుమతులివే

National Parents Day 2023: తల్లిదండ్రులను ఆర్థికంగా సురక్షితంగా ఉంచే బహుమతులివే
ప్రేమకు ప్రతీకగా నిలిచే తల్లిదండ్రుల కోసం పిల్లలు ఇవ్వాల్సిన బహుమతులు

జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు. వారికి ఏం చేసినా బుుణం తీర్చుకోలేం. పిల్లల సంతోషం కోసం ఎంతటి త్యాగాలైనా చేసే వాళ్లలో ముందుండే తల్లిదండ్రులకు కూడా సంవత్సరంలో ఒక రోజుంది. ఈ రోజునే 'నేషనల్ పేరెంట్స్ డే'గా జరుపుకుంటాం. మామూలుగా జూలై నెలలో వచ్చే నాలుగో ఆదివారాన్ని ఈ రోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ప్రేమకు, త్యాగానికి ప్రతీకగా నిలిచే తల్లిదండ్రులకు ఈ రోజున ఎలాంటి బహుమతులు ఇవ్వాలి. ఎలా వారి జీవితాన్ని సార్థకం చేయాలో.. వారి ఆనందాన్ని రెట్టింపు చేయాలో ఇప్పుడు చూద్దాం.

నిస్వార్థమైన ప్రేమనందిస్తూ, తమ సర్వస్వాన్ని పిల్లలకే అంకితం చేసే అమ్మానాన్నలకు వృద్ధాప్యంలోనూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేలా చూడడం పిల్లల బాధ్యత. ఒకవేళ మీకు ఇప్పటికీ పని చేసే తల్లిదండ్రులు ఉన్నట్లయితే, మీరు వారికి 5 లేదా6 లేదా 7 సంవత్సరాల ప్రీమియం పెట్టుబడి పెట్టే ఆదాయ బీమా ప్లాన్‌లను అందించవచ్చు. దీని వల్ల వారు జీవితాంతం ఆదాయాన్ని పొందుతారు. దీనికి వడ్డీ రేటు కూడా ఉంటుంది. ఇది బ్యాంకులు అందించే ప్రస్తుత ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.

అధిక రిస్క్ టాలరెన్స్ ఉన్నవారు సంపదను పెంచుకునే లక్ష్యంతో యులిప్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికోసం పిల్లలు వార్షిక ప్రీమియమ్ ను చెల్లించవచ్చు, వీటిని ఈక్విటీ ఫండ్లలోనూ పెట్టుబడిగా పెట్టవచ్చు. ఫలితంగా పేరెంట్స్ పదవీ విరమణ చేసినప్పుడు, పదవీ విరమణ తర్వాత కూడా ఇది వారి ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. దీని వల్ల మరో దానిపై పెట్టుబడి పెట్టగల మొత్తాన్ని కూడా పొందుతారు.

మీ తల్లిదండ్రులు పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్నట్లయితే, ప్రీమియం రిటర్న్ ఆప్షన్‌తో యాన్యుటీలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా వారు నెలవారీ ఆదాయాన్ని కూడా సులభంగా పొందవచ్చు.

వయసు పెరుగుతున్నా కొద్దీ తల్లిదండ్రులు పని చేసే శక్తిని కోల్పోతూ ఉంటారు. వయసుతో పాటు వచ్చే కొన్ని వ్యాధులు వారిని మరింత ఇబ్బంది పెట్టవచ్చు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు, ఎక్కడ్నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేం. కాబట్టి ఈ సమయంలో డబ్బు విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పట్నుంచే ఆ దిశగా ఆలోచించడం చాలా ముఖ్యం. అందుకు ఉత్తమ మార్గం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇది ఆపత్కాలంలో అవసరంగా ఉపయోగపడుతుంది.

రోజుకో వ్యాధి పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మెడికల్ ధరలు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి. అంటువ్యాధులు, ఇతర వయసు పైబడడంతో వచ్చే వ్యాధులు తల్లిదండ్రులను మరింత ఇబ్బందులకు గురయ్యేలా చేయవచ్చు. కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రులకు ఆరోగ్య బీమాను ముందుగానే తీసుకోవడం సరైన మార్గం అని చెప్పవచ్చు. ఆరోగ్య బీమాను వీలైనంత త్వరగా పొందడం చాలా ముఖ్యం. లేదంటే తగిన బీమా పాలసీని పొందడం కష్టతరమవుతుంది.

తల్లిదండ్రులు ఆర్థికంగా సురక్షితంగా ఉంచేందుకు పిల్లలు తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలే... వారికి భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రుల సంతోషం, ఆరోగ్యం కోసం ఈ రోజే తగిన ప్లాన్ లు, బీమాలు చేయించి వారిని మరింత ఆనందంగా చూసుకోండి. ఈ సందర్భంగామీ అందరికీ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు.


Tags

Read MoreRead Less
Next Story