కరోనాను తగ్గించడానికి సరికొత్త ఔషధం

కరోనాను తగ్గించడానికి సరికొత్త ఔషధం
ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారికి కరోనా వచ్చిందేమోనన్న భయాందోళనలు మనుషులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రపంచమంతా మొత్తం ఇదే పరిస్థితి.. కరోనా అంటేనే వణికిపోతున్నారు..

ఎవరైనా దగ్గినా, తుమ్మినా వారికి కరోనా వచ్చిందేమోనన్న భయాందోళనలు మనుషులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రపంచమంతా మొత్తం ఇదే పరిస్థితి.. కరోనా అంటేనే వణికిపోతున్నారు. మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. ఫ్రిబ్రవరిలో కరోనా అంతం అవుతుందంటున్నారు.. ఈ క్రమంలో కేసులు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు దీనిని తట్టుకోలేకపోతున్నారు. అటువంటి తరుణంలో కరోనాను ఎదుర్కోవడానికి వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో సూచిస్తున్నారు.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు సహాయపడతాయి. అంతేకాదు ప్రతిరోజు సాధ్యమైనంత సమయం వ్యాయాయం, యోగా వంటివి చేయడం వలన శరీరం ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది.. దీనివలన శరీరంలో ఇమ్యూనిటీ బూస్టర్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. ఇవే కాక మెడికల్ షాపులలో కొన్ని ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్ లు దొరుకుతాయి.. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇందులో ముఖ్యంగా సీసీఎంబీ రీసెర్చ్ చేసిన coronaid అనే ఔషధం మార్కెట్లోకి వచ్చింది. ఇది ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా కరోనాను ఎదుర్కోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సామాన్యులకు సైతం ఈ ఔషధం అందుబాటులో ఉంది. ఈ ఔషధం అందించే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.. ఇది శరీరంలోని సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల్లోని సిలియాను సంరక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ మెడిసిన్ కు సీసీఎంబీ నుంచి కూడా ఆమోదం లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధాన్ని NuZen సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story