Sesame Oil: నువ్వుల నూనెతో ముఖ సౌందర్యం..

Sesame Oil: నువ్వుల నూనెతో ముఖ సౌందర్యం..
ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా

Sesame Oil: నువ్వులను తిల్ అని కూడా పిలుస్తారు, ప్రధానంగా వీటిని నూనె కోసం పండిస్తారు. నువ్వులలో అనేక పోషకాలు, ఫైబర్‌ ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వులను వేయించి పొడి చేసుకుని వంటల్లో వాడుకోవచ్చు. నువ్వుల నూనెతో చేసిన వంటలు రుచికరంగా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) ను తగ్గిస్తుంది. నువ్వులు డయాబెటిక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించటానికి కూడా సహాయపడతాయి.

ఆయుర్వేదం ప్రకారం, ముడి నువ్వులను తీసుకోవడం ద్వారా వాత దోషాలు తగ్గుతాయి. ఇది ఆహారం జీర్ణమవడానికి ఉపకరిస్తుంది.

నువ్వుల నూనెలో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆర్థరైటిక్ నొప్పి, మంట నిర్వహణకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కీళ్లకు మసాజ్ చేయడం వల్ల నొప్పి, మంట తగ్గుతుంది. నువ్వుల నూనె చర్మానికి మేలు చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రాయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్ల కారణంగా చర్మం బిగుతుగా ఉంటుంది. ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు గాయాల్ని నయం చేయడానికి సహకరిస్తుంది.

పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి. ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.

నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మధుమేహం, బీపీ లను నివారిస్తుంది.

ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అయితే కొంత మందిలో నువ్వులు అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి. కాబట్టి అలాంటి అలెర్జీ చర్యలు ఏమైనా ఎదురైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story