ఆవిరి పడుతున్నారా.. అయితే ఆరోగ్య మంత్రి ఏం చెప్తున్నారంటే..

ఆవిరి పడుతున్నారా.. అయితే ఆరోగ్య మంత్రి ఏం చెప్తున్నారంటే..
జలుబుతో మూసుకు పోయిన ముక్కు రంద్రాలు తెరుచుకునేందుకు ఆవిరి బ్రహ్మాండంగా పని చేస్తుందని అమ్మమ్మ నుంచి అమ్మ వరకు చెప్పే మాటే.

కాస్త జలుబు చేస్తే ఆవిరి పట్టమని చెప్పడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అదే కోవిడ్ కాలంలో ప్రతి ఇంటా అందరూ చేస్తున్న పని. ఇందుకోసం ఆవిరి పట్టే వస్తువులకు మార్కెట్లో గిరాకీ కూడా బాగా పెరిగింది.

జలుబుతో మూసుకు పోయిన ముక్కు రంద్రాలు తెరుచుకునేందుకు ఆవిరి బ్రహ్మాండంగా పని చేస్తుందని అమ్మమ్మ నుంచి అమ్మ వరకు చెప్పే మాటే. ఆఖరికి డాక్టర్లు కూడా ఆవిరి పట్టమని సలహా ఇస్తుంటారు. కానీ ఆవిరి పట్టడం అంత మంచి కాదని స్వయానా ఆరోగ్య మంత్రి హెచ్చరించే సరికి ఆలోచించాల్సి వస్తోంది.

మూసుకుపోయిన ముక్కు రంద్రాలతో పాటు గొంతును క్లియర్ చేయడంలో వేడి ఆవిరిని తీసుకోవడం ప్రయోజనకరంగా భావిస్తారు. కరోనా మహమ్మారి నుంచి కాస్త రిలీఫ్ కోసం ఆవిరి తీసుకోవాలని చాలా మంది వైద్యులు సూచించారు.

ఇటీవలి పరిణామంలో, సరైన వైద్య సలహాలను పాటించకుండా ఆవిరిని పీల్చవద్దని తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ సోమవారం (మే 17) రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

కోవిడ్ సంక్రమణకు వ్యతిరేకంగా నివారణ చర్యగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆవిరిని పడుతున్నారని ఆరోగ్య మంత్రి చెప్పారు. సరైన సలహా లేకుండా ఆవిరిని పీల్చడం ఊపిరి తిత్తులను దెబ్బతీస్తుందని అన్నారు.

ప్రజలకు కోవిడ్ లక్షణాలు ఉంటే వారు సొంతంగా మందులు తీసుకోవడం కంటే వైద్యుడిని సంప్రదించాలి అని సుబ్రమణియన్ చెప్పారు.

అయితే ఆవిరిని పీల్చడం వలన ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా సహాయపడుతుందని సోషల్ మీడియాలో అనేక పోస్టులు చూస్తుంటాము ప్రతి రోజు.. ఏదేమైనా వైద్యుని సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story