రోగనిరోధక శక్తి కోసం ఉల్లిపాయ టీ: దగ్గు, జలుబును తగ్గించే ప్రభావవంతమైన ఇంటి వైద్యం

రోగనిరోధక శక్తి కోసం ఉల్లిపాయ టీ: దగ్గు, జలుబును తగ్గించే ప్రభావవంతమైన ఇంటి వైద్యం
పాత వైద్య పద్ధతులు తక్షణ ఉపశమన ప్రభావాలను కలిగి ఉండి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.

విటమిన్ సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉల్లిపాయల్లో కూడా అధికంగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబుతో పోరాడేందుకు ఉల్లిపాయ టీ అమోఘంగా పని చేస్తుంది.

సాధారణ అనారోగ్యాలను నియంత్రించడానికి పెద్దవాళ్లు ఇంట్లోని వస్తువులతో నివారణోపాయలను కనుగొనేవారు. అందుకే ఆపరేషన్లు వంటి వాటికి తప్ప ఆస్పత్రికి వెళ్లే అవసరం ఉండేది కాదు. నేటి తరం పెద్ద వారి మాటలను, ఇంటి వైద్యాన్ని విస్మరిస్తున్నారు. కానీ కొన్ని పాత వైద్య పద్ధతులు తక్షణ ఉపశమన ప్రభావాలను కలిగి ఉండి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అమ్మమ్మ మెను నుండి మనం తీసుకోగలిగే హోం రెమెడీస్‌లో ఉల్లిపాయ టీ ఒకటి. ఈ పానీయం మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం వంటి వాటి నుండి ఉపశమనం కలిగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది.

విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలకు ఉల్లిపాయలు అమూల్యమైన వనరు అని నిపుణులు సూచిస్తున్నారు . ఉల్లిపాయలు కూరకి రుచిని ఇవ్వడంతో పాటు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయలతో చేసిన గోరు వెచ్చని టీ ద్వారా అధిక ప్రయోజనాలను పొందవచ్చు.

ఉల్లి టీ తయారీ..

రోగనిరోధక శక్తి కోసం ఉల్లిపాయ టీ రెసిపీ:

మరిగించిన నీరు 1 గ్లాసు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, 2-3 నల్ల మిరియాలు, ఇలాచీ 1, అర స్పూన్ సోంపు గింజలు అన్నీ కలిపి 15-20 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఆ తరువాత టీని వడకట్టి ఓ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.

Tags

Read MoreRead Less
Next Story