కరోనా టెన్షన్.. 45 నిమిషాల్లో ఖతం..

కరోనా టెన్షన్.. 45 నిమిషాల్లో ఖతం..
దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, పిల్లలు, యుక్తవయసు వారు రోజుకు గంట సేపు వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం.

24 గంటల్లో ఓ గంట మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేరా.. ఏదో ఒక వ్యాయామం.. నడక, యోగ వంటివి చేస్తే ఆరోగ్యంతో పాటు కరోనా లాంటి మహమ్మారులు కూడా దరి చేరవంటున్నారు చైనా పరిశోధకులు. కాలేజీ విద్యార్థులపై తాము నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని నిరూపించిందని చెబుతున్నారు. ప్రతి రోజు 45 నిమిషాలు కఠినమైన వ్యాయామాలు, శారీరక శ్రమ చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు అని వివరిస్తున్నారు.

వ్యాయామం, శారీరక శ్రమతో మెదడులో డొపమైన వంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రసాయనాలు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి ఉత్సాహాన్ని, హుషారును కలిగిస్తాయి. ఏకాగ్రత పెరగడంతో పాటు లేని పోని ఆలోచనలు, భయాలు మనసును వేధించవు అని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తోంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. వీటికి త్వరలోనే ప్రపంచ దేశాల ఆమోద ముద్ర లభించనుంది.

కరోనా భయంతో చాలా మంది ఇంటికే పరిమిత మవుతున్నారు. వీరికి ఏ విధమైన శారీరక వ్యాయామం లేకపోతే మధుమేహం వంటి జబ్బులు దరిచేరే ప్రమాదం ఉంది. అందుకే ఒక మాదిరి నుంచి కఠినమైన ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయడం అవసరం అని సూచించారు. ఇలా చేయడం వలన గుండె వేగంగా కొట్టుకుంటుంది.. దాంతో ఆక్సిజన్ మరింత ఎక్కువగా గ్రహించే అవకాశం ఉంటుంది అని సూచించారు.

దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, పిల్లలు, యుక్తవయసు వారు రోజుకు గంట సేపు వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం. వృద్ధులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలని ఆరోగ్య సంస్థ వివరించింది. దీంతో వారు పట్టు తప్పి కింద పడిపోవడాన్ని నివారించొచ్చని అంటున్నారు. మధుమేహం, గుండెజబ్బులు వంటివి కోవిడ్ ముప్పును మరింత తీవ్రం చేస్తాయి. కరోనా కాలంలో కదల కుండా ఇంట్లో కూర్చుంటే జబ్బులను కొని తెచ్చుకోవడమే.. కనుక మీ కారిడార్‌లోనే ఈ రోజు నుంచే వ్యాయామం ప్రారంభించమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. పెద్దవాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరు, యుక్తవయసు వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు తగినంత శారీరక శ్రమ చేయడం లేదని తేలింది. మెదడు ఆరోగ్యంగా పని చేయడానికి, గుండె పని తీరును మెరుగు పరచడానికి, వైరస్ వంటి వ్యాధులు దరి చేరకుండా ఉండడానికి ప్రతి కదలికా ముఖ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ చెబుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story