కూరగాయలను సబ్బు, శానిటైజర్‎తో కడుగుతున్నారా..? ఆగండి..ఇది మీ కోసమే..

కూరగాయలను సబ్బు, శానిటైజర్‎తో కడుగుతున్నారా..? ఆగండి..ఇది మీ కోసమే..
Vegetables Cleaning: కరోనా మహమ్మారి రావడంతో ప్రతి ఒక్కరు సబ్బు, శానిటైజర్‎తో చేతులు కడుక్కోవడం అలవాటైంది.

Vegetables Cleaning: కరోనా మహమ్మారి రావడంతో ప్రతి ఒక్కరు సబ్బు, శానిటైజర్‎తో చేతులు కడుక్కోవడం అలవాటైంది. దాంతో మర్కెట్ నుంచి వచ్చిన ప్రతి దానిని శానిటైజ్ చేస్తున్నారు. అంటే, నిత్యం వంట కోసం తీసుకొచ్చే కూరగాయలతోపాటు పండ్లను సబ్బుతో శుభ్రపరుస్తున్నారు. అయితే పండ్లు, కూరగాయలు ఎలా, దేనితో శుభ్రం చేయాలనే అవగాహన లేదు. చాలా మంది ఇంట్లో వాడే సబ్బులతోనే పండ్లను శుభ్రం చేస్తున్నారు. కొంతమంది డెటాల్‌, శానిటైజర్లు, సర్ఫ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. క్లీనింగ్ వస్తువులతో శుభ్రం చేయాలనేది కేవలం అపోహ మాత్రమేనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది.

ఇలా క్లీన్‌ చేయడం వల్ల వాటిని తింటే మనకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని ఎఫ్‌డీఏ తెలిపింది. పండ్లు, కూరగాయలను సబ్బు, డిటర్జెంట్లతో శుభ్రం చేసినప్పుడు వాటి తొక్కపై కొంత మిగిలిపోతుందని, వాటిని తిన్నప్పుడు మన పొట్టలోకి వెళ్తాయని ఎఫ్‌డీఏ తెలిపింది. ఇలాంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా జీర్ణకోస సంబంధ సమస్యలు వస్తాయని అన్నారు. వాంతులు, విరేచనాలతోపాటు డయోరియాకు దారితీసే ప్రమాదముందని చెబుతున్నారు. నీటి కింద కూరగాయాలను శుభ్రం చేయడం వల్ల ఇ.కొలై, సాల్మనెల్లా, లిస్టేరియా వంటి రోగకారకాలు 90 నుంచి 99 శాతం వరకు తొలిగిపోతాయ ప్రొఫెసర్‌ బెన్‌ చాప్‌మ్యాన్‌ చెబుతున్నారు.


ఇలా క్లీన్ చేయండి

-కూరగాయలు, పండ్లను శుభ్రం చేసే ముందు చేసిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవలి

-కూరగాయలు, పండ్లను మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే కుళాయి కింద పెట్టి మెల్లగా నీరు పోస్తూ కడగాలి.

-దుమ్ము, బ్యాక్టీరియా బయటకు వదలిపోతాయి

-కుళాయిలో నీరు మరీ నెమ్మదిగా వదలాలి.

- పండ్లు పగిలి ఉంటే..ఆ భాగాన్ని తొలగించి వాడుకోవడం చేయాలి.

-బంగాళదుంప, చిలగడదుంప, క్యారట్‌, అల్లం శుభ్రం చేసుకునేందుకు బ్రష్‌ వాడాలి

-కూరగాయలు, పండ్లను శుభ్రం చేసుకునేందుకు బ్రష్‌ లేదా స్పాంజ్‌ వాడాలి.

-కూరగాయలను కడిగేప్పుడు పాత్రలో వేయకూడదు.

-ఆకుకూరలను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి.

-ఆకుకూరలను పెద్ద పాత్రలో వేసి నీరు, ఉప్పు వేసి ఉంచాలి

-పురుగులు ఉంటే బయటకు వస్తాయి.

-ఆకుకూరలను టవల్‌లో ఉంచి నీరు వెళ్లేలా చేస్తే ఫ్రేష్ గా ఉంటాయి.

-ప్రీ వాష్‌డ్‌, ప్రీ బ్యాగ్‌డ్‌ పదార్థాలను మరోసారి శుభ్రం చేయాలి

Tags

Read MoreRead Less
Next Story