ఉల్లిపాయ కోస్తూ ఎందుకు ఏడవడం.. ఈ చిట్కాతో చెక్ పెట్టేద్దాం

ఉల్లిపాయ కోస్తూ ఎందుకు ఏడవడం.. ఈ చిట్కాతో చెక్ పెట్టేద్దాం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా సింపుల్‌గా ఉంది. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

ఉల్లి పాయ లేకుండా ఏం కూర వండలేం. అందుకే ఎంత రేటు పెట్టైనా ఉల్లిపాయలు కొనాల్సిందే.. ఉల్లి వేస్తే కూరకి రుచి వస్తుందేమో కానీ, కోస్తుంటే కళ్ల వెంట నీళ్లు మాత్రం గ్యారంటీ. మరి దీన్ని అరికట్టాలంటే చాలా చిట్కాలే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా సింపుల్‌గా ఉంది. మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

కళ్ల వెంట నీళ్లు రాకపోతే హ్యాపీగా ఎన్ని ఉల్లిపాయలైనా కోసేయొచ్చు. మ్యాక్స్ మెక్‌కెన్ అనే వ్యక్తి కళ్ల వెంట నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కోయవచ్చో వివరిస్తున్నారు. ఈ వీడియోలో ఓ వస్త్రాన్ని తీసుకుని దాన్ని తడిపి ఉల్లిపాయలు కట్ చేసే చాప్ బోర్డ్ మీద ఉంచారు. ఆ తరువాత ఉల్లిపాయలు తరగడం మొదలు పెడితే మీ కళ్ల వెంట ఒక్క చుక్క కూడా నీరు రాదంట.

ఉల్లి నుంచి వచ్చే కొన్ని ఆమ్లాలు కళ్ల వెంట నీళ్లు తెప్పిస్తాయి. తడి వప్త్రాన్ని చాపింగ్ బోర్డు మీద ఉంచడం వలన అది ఆమ్లాలను పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిలో ఉండే ఘాటైన యాసిడ్స్ కళ్లను చేరవు కాబట్టి కళ్లు మండవు అని మ్యాక్స్ వీడియోలో వివరిస్తున్నారు.

ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story