గుడ్లు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే..

గుడ్డు.. వెరీ గుడ్డు.. ప్రతి రోజూ ఓ గుడ్డు తినమని భారతీయ పోషకాహార సంస్థ వెల్లడిస్తుంటుంది. ఇందులో ఉన్న ప్రొటీన్, కాల్షియం శరీరానికి చాలా అవసరం అని గుడ్డు విలువను తెలియజేస్తుంది. మరి ఒక్కసారే తెచ్చిన ఓ డజన్ గుడ్లను ఫ్రిజ్‌లో తోసేయడం పరిపాటి. గుడ్లు పెట్టుకోవడానికి ఏకంగా ఫ్రిజ్ డోర్‌కి ఓ అర కూడా ఇస్తారు.. మరి ఫ్రిజ్‌లో పెట్టొద్దంటారేమిటని డౌట్ వస్తుంది అందరికీ.. కానీ కొత్త అధ్యయన ఫలితాలు గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయొద్దని చెబుతున్నాయి.
అలా నిల్వ చేసిన గుడ్లు అనారోగ్య హేతువులు అని అంటున్నారు పరిశోధకులు. చల్లని ఉష్ణోగ్రతలలో గుడ్లను నిల్వ చేయడం వలన షెల్ మీద బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. అది గుడ్డులోకి కూడా రావచ్చు. తద్వారా ఈ గుడ్డు వినియోగం అనారోగ్యానికి కారణమవుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద గుడ్లు నిల్వ ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం, గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com