స్మోకింగ్‌ను మాన్పిస్తుంది..ఎంతకాలం బతుకుతారో చెప్పేస్తుంది!

స్మోకింగ్‌ను మాన్పిస్తుంది..ఎంతకాలం బతుకుతారో చెప్పేస్తుంది!
దూమపానం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య. పోగ తాగుతున్న వారే కాదు. ఆ అలవాలు లేనివారు కూడా పరోక్షంగా దీని ప్రభావంలో పడుతున్నారు.

దూమపానం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య. పోగ తాగుతున్న వారే కాదు. ఆ అలవాలు లేనివారు కూడా పరోక్షంగా దీని ప్రభావంలో పడుతున్నారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ మంది పొగాకు బానిసలై ఉన్నారు. నేరుగా పోగాకు ఉపయోగించే 7 మిలియన్ మంది దాని వల్ల కలిగే వ్యాధులతో చనిపోతున్నారు. పరోక్ష స్మోకింగ్ వల్ల 8,90,000 మంది మరణించారు. స్మోకింగ్ వల్ల కేన్సర్, గుండె వ్యాధులు, బ్రైన్ స్ట్రోక్, ఊపిరితీత్తుల వ్యాధులతో మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

పొగతాగడం ఆరోగ్యానికి హానికరమంటూ ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పించిన, చాలా మంది ఆ అలవాటు మనలేకపోతున్నారు. వాటికి బానిసలుగా మారి పొగతాగడం ఆరోగ్యానికి మంచిదికాదు అని తెలిసినా.. కొంతమంది ఆ అలవాటును మానుకోరు.అయితే ధూమపానం అలవాటును మానుకోవడానికి ఓ స్మార్ట్‌ యాప్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. 'హెల్త్‌స్పాన్‌'. పేరుతో ఈ యాప్‌ను గూగుల్ త్వరలో లాంచ్ చేయనుంది. పోగతాగడం మానేస్తే ఎన్నిఉపయోగాలు ఉన్నాయో చెప్పేందకు ఈ యాప్ సిద్దమవుతుంది.

ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే స్మోకింగ్ దూరంగా ఉండడం వలన శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఈ యాప్‌ గుర్తించి చెబుతుంది. ఇంకా ఎంతకాలం జీవిస్తారు అనే విషయం కూడా 'హెల్త్‌స్పాన్‌' చేప్పేస్తుంది. ధూమపానం మాన్పించడంతోపాటు, దాని వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలను పసిగడుతుంది. అలాగే రోజువారి ఫలితాలను బట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందో ఈ యాప్ గైడ్ చేస్తుంది. సరికొత్త మొబైల్‌ యాప్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story