సుశాంత్ సింగ్ కేసులో ఎయిమ్స్ సంచలన రిపోర్ట్

సుశాంత్ సింగ్ కేసులో ఎయిమ్స్ సంచలన రిపోర్ట్
* సుశాంత్‌ మృతి కేసులో మరో ట్విస్ట్‌ * హత్యకాదు ఆత్మహత్యేనని తేల్చిన AIIMS వైద్యుల నివేదిక

* సుశాంత్‌ మృతి కేసులో మరో ట్విస్ట్‌

* హత్యకాదు ఆత్మహత్యేనని తేల్చిన AIIMS వైద్యుల నివేదిక

* సుశాంత్‌ విషప్రయోగం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపణ

* జూన్‌ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో చనిపోయిన సుశాంత్‌

* సుశాంత్‌ కేసును హత్య కోణంలో విచారణ ప్రారంభించిన CBI

* AIIMS తాజా నివేదికతో ఆత్మహత్య కోణంలో సాగనున్న విచారణ

* 57 రోజుల్లో 20 మందిని విచారించిన CBI అధికారులు

* సుశాంత్‌ ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌లు, డిజిటల్‌ కెమెరాలు, మొబైల్‌ ఫోన్ల పరిశీలన

* సుశాంత్‌ మృతిలో డ్రగ్స్‌ కోణంలో విచారణ చేపడుతున్న NCB

* ఇప్పటికే NCB రిమాండ్‌లో రియా, షోవిక్‌

* వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా నలుగురు హీరోయిన్లకు సమన్లు

* NCB విచారణ ఎదుర్కొన్న రకుల్, దీపికా, సారా, శ్రద్ధా

* డ్రగ్స్‌ కోణంలో మరింత లోతుగా విచారణ చేపడుతున్న NCB

* NCB విచారణ సాగే కొద్దీ తెరపైకి బాలీవుడ్‌లో టెన్షన్‌

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మృతి కేసులో... విషప్రయోగంతో హత్య జరిగిందనే వాదనకు AIIMS వైద్యులు తెరదించారు. సుశాంత్‌ది హత్యకాదని... ఆత్మహత్యని.. AIIMS వైద్యులు.. CBIకి నివేదిక అందించారు. సుశాంత్‌ను విషప్రయోగంతో హత్యచేశారని.. కుటుంబ సభ్యులు వాదిస్తూ వచ్చారు. ఇప్పుడదంతా నిజంకాదని వైద్యుల బృందం తేల్చింది. 34 ఏళ్ల సుశాంత్‌... జూన్‌ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో మరణించాడు. గత అటాప్సీ రిపోర్ట్‌లోనూ.. అది ఆత్మహత్యేనని ముంబై పోలీసులు తేల్చారు. కానీ సుశాంత్ కుటుంబ సభ్యులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో.. హత్య దిశగా.. CBI విచారణ ప్రారంభించింది.

AIIMS వైద్య బృందం తాజా నివేదికలో మెడికో లీగల్ ఒపీనియన్లు కూడా తీసుకున్నట్టు అధికారులు ధృవీకరించారు. సుశాంత్‌ది ఆత్మహత్యేనని తాజా నివేదిక రావడంతో.. CBI అధికారులు ఇక ఆకోణంలో విచారించనున్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత లోతుగా విచారించనున్నారు. ముంబై హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించినపుడు కూడా... ఉరివేసుకోవడం వల్లే మరణం సంభవించిందని తేల్చారు. ఇప్పుడు AIIMS వైద్యుల ప్యానెల్‌ కూడా.. అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

సుశాంత్‌ మృతికి గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి వేధింపులే కారణమని అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లయింట్‌ తర్వాత... CBI రంగంలో దిగింది. 57 రోజుల వ్యవధిలో.. CBI అధికారులు 20 మందిని విచారించారు. సుశాంత్ ల్యాప్‌టాప్‌తోపాటు హార్డ్‌ డిస్క్‌లు, డిజిటల్ కెమెరాలు, రెండు మొబైల్ ఫోన్లను పరిశీలించారు. విచారణను హత్య కోణంలోనే ప్రారంభించినప్పటికీ... అలాంటి ఆధారాలేవి లభించలేదని CBI వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు AIIMS నివేదిక కూడా ఆత్మహత్యేనని చెప్పడంతో.. ఆ కోణంలో విచారణ ప్రారంభిస్తామన్నారు.

అటు.. సుశాంత్‌ ఆత్మహత్యలో డ్రగ్స్‌ కోణం కూడా వెలుగు చూడటంతో... విచారణలో NCB అధికారులు బిజీగా ఉన్నారు. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్ సహా పలువురిని విచారించారు. తాను డ్రగ్స్‌ వాడనప్పటికీ... సుశాంత్‌కు అందించినట్టు.. రియా ఒప్పుకున్నట్టు NCB అధికారుల విచారణలో తేలింది. రియా, షోవిక్‌ ప్రస్తుతం NCB రిమాండ్‌లో ఉండగా.. వాట్సాప్‌ చాట్‌ల ఆధారంగా నలుగురు హీరోయిన్లు... రకుల్‌ ప్రీత్ సింగ్‌, దీపికా పదుకునే, సారా అలీ ఖాన్‌, శ్రద్ధాకపూర్‌లు NCB అధికారుల విచారణ ఎదుర్కొన్నారు. డ్రగ్స్‌ కోసం వాట్సాప్‌ చాటింగ్‌లు జరిపినట్టు అంగీకరించినట్టు తేలింది. ప్రస్తుతం వీరంతా ఇచ్చిన సమాచారం ఆధారంగా... డ్రగ్స్‌ కేసును మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తోంది NCB.

Tags

Read MoreRead Less
Next Story