ప్రభుత్వ డాక్టర్లకు డ్రెస్ కోడ్.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవట

ప్రభుత్వ డాక్టర్లకు డ్రెస్ కోడ్.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవట
ఈ నిబంధనలు డే షిఫ్ట్ తో పాటు నైట్ షిఫ్ట్ లో పనిచేసే డాక్టర్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది

డాక్టర్లకు డ్రెస్ కోడ్ ను అమలు చేసింది హర్యాణ సర్కారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే వైధ్యులు యునిఫాం వేసుకోవాలని సూచించింది. పేషెంట్లకు డాక్టర్లకు, సిబ్బందికి తేడా గుర్తించేవిధంగా ఉండాలని తెలిపింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేసే వైద్యులు, సిబ్బంది.. డెనిమ్ జీన్స్, పలాజో ప్యాంట్లు, బ్యాక్‌లెస్ టాప్స్, స్కర్ట్‌లు ధరించి హాస్పిటల్ కు రాకూడదని స్సష్టం చేసింది. మహిళా వైద్యులు మేకప్ వేసుకోవద్దని, బరువైన ఆభరణాలు ధరించవద్దని, గోళ్లు పొడవుగా పెంచవద్దని, పురుషులు కాలర్ కంటే కిందికి వెంట్రులను పెంచవద్దని సూచించింది.

ఈ నిబంధనలు డే షిఫ్ట్ తో పాటు నైట్ షిఫ్ట్ లో పనిచేసే డాక్టర్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. వైద్యులు చెమట కనిపించే డ్రెస్ లు, డెనిమ్ స్కర్టులు, షార్ట్స్ లేదా ప్యాంట్ లు బాడీ హగ్గింగ్ ప్యాంట్ లు స్ట్రాప్‌లెస్ టాప్‌లు, బ్యాక్‌లెస్ టాప్‌లు, క్రాప్ టాప్‌లు, డీప్-నెక్ టాప్‌లు, ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌లు, స్నీకర్లను కూడా వేసుకోకూడదని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story