ఆప్ నాయకులు హద్దులు దాటారు : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఆప్ నాయకులు హద్దులు దాటారు : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇవి చిన్న సమస్యలేనని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని తనకు అర్థమైందన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కు ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్య మాటల యుద్దం నడిచింది. తన కార్యాలయానికి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య జరిగిన మాటల యుద్దం హద్దులు దాటిందని అన్నారు సక్సేనా. అయితే ఇది తన సొంత ప్రభుత్వమని తనకు సీఎం కేజ్రీవాల్ కు మధ్య సంబంధాలు విచ్చిన్నం కాలేవని సక్సేనా స్పష్టం చేశారు.

సక్సేనా వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ... ఇవి చిన్న సమస్యలేనని చెప్పారు. అయితే ప్రజాస్వామ్మాన్ని గౌరవించాలని తనకు అర్థమైందని అన్నారు. రెండు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయడానికి అనుమతించాలని, పని చేయనివ్వకుండా అడ్డంకులు పెట్టడం సరికాదన్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా బీజేపీ జోక్యం చేసుకోవడం సభా స్వరూపాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు.

సక్సేనా ప్రసంగానికి భంగం కలిగించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి పంపాలని అన్నారు. వికె సక్సేనా... సభలో ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ, ఆప్ శాసనసభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. గందరగోళం మధ్య ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.


ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్.. సభకు ఆర్డర్ తీసుకురావడానికి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్ చేయడానికి ఆదేశించవలసి వచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన అశ్వికాదళాన్ని చుట్టుముట్టారు. ఇదిలా ఉంటే... బీజేపీ ఆదేశానుసారం లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది.


Tags

Read MoreRead Less
Next Story