UP: సహ విద్యార్ధిని చెంపలు వాయించిన మెడికో...

UP: సహ విద్యార్ధిని చెంపలు వాయించిన మెడికో...

సహ విద్యార్ధిని అని కనికరంలేకుండా ఓ మెడికో ఆమెను ఇష్టానుసారం కొట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మోరాదాబాద్ లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మెడికల్ కాలేజీలో ఇద్దరు విద్యార్ధులు తొలుత సైలెంట్ గానే కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమ్మాయి ఏదో అనడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన విద్యార్ధి ఆమె చెంపలపై వరుసగా కొట్టడం ప్రారంభించాడు. తొలుత అమ్మాయి సైతం ఫైట్ బ్యాట్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, అతడి బలానికి నిలబడలేకపోయింది. దీంతో సదరు విద్యార్ధి మరింత రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో మొరాదాబాద్ పోలీసులకు చేరడంతో ఘటనపై దర్యప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story