కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రీఛార్జ్ లను ప్రకటించలేదు : PIB

కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రీఛార్జ్ లను ప్రకటించలేదు : PIB

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉచిత ఫోన్ రీఛార్జ్ ( టారిఫ్ ) పథకాలను అందించడంలేదని స్పష్టం చేసింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB). వాట్సప్ లో ప్రచారం అవుతున్న సందేశం అవాస్తవమని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 28రోజుల పాటు చెల్లుబాటు అయ్యే రూ.239 ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను అందజేస్తోందని పేర్కొంటూ ఒక సందేశానికి సంబంధించిన వివరణను తెలియజేసింది.

"బ్లూ లింక్"పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారు ఉచిత రీఛార్జ్ పొందవచ్చన్న సందేశం... సోషల్ మీడియాలో, వాట్సప్ లో చెక్కర్లు కొడుతోందని అధికారులు తెలియజేశారు. “‘ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్’ కింద కేంద్ర ప్రభుత్వం వినియోగదారులందరికీ ₹239 రీఛార్జ్‌ని 28 రోజుల పాటు అందజేస్తోందని వాట్సాప్ సందేశం పేర్కొంది. ఈ దావా నకిలీ. భారత ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన చేయలేదు” అని PIB ఫ్యాక్ట్-చెక్ టీమ్ తెలియాజేసింది.

వాట్సప్ లో చక్కర్లు కొడుతోన్న సందేశాన్ని యాడ్ చేశారు అధికారులు.. అది ఈ విధంగా ఉంది.
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత మొబైల్ రీఛార్జ్ పథకం కింద, భారతీయ వినియోగదారులందరికీ 28 రోజుల పాటు ₹239 ఉచిత రీఛార్జ్ ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి ఇప్పుడు దిగువ బ్లూ కలర్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయండి. నేను దీనితో నా 28 రోజుల ఉచిత రీఛార్జ్ చేసాను. దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు 28 రోజుల ఉచిత రీఛార్జ్‌ను కూడా పొందవచ్చు (చివరి తేదీ 30 మార్చి, 2023)”అనే మెజేస్ నకిలీదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story