కారు టైర్లో 10 అడుగుల ఫైథాన్.. వీడియో వైరల్

కారు టైర్లో 10 అడుగుల ఫైథాన్.. వీడియో వైరల్
బిజీగా ఉన్న రహదారిపై ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. కారు టైర్‌లో చిక్కుకున్న భారీ పైథాన్‌ను

కారెక్కి షికారుకి వెళ్దామనుకుందో ఏమో ఎంచక్కా కారు టైర్లో ముడుచుకుని కూర్చుంది. రహదారిని దాటడానికి దాదాపు 10 అడుగుల పొడవైన ఫైథాన్ చేసిన ప్రయత్నాన్ని కారు డ్రైవర్లు మరియు మోటారు సైకిలిస్టులు అడ్డుకున్నారు. దాంతో దానిక్కూడా కంగారు వేసి సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న కారు టైర్‌లోకి దూరిపోయింది. దీంతో బిజీగా ఉన్న రహదారిపై ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. కారు టైర్‌లో చిక్కుకున్న భారీ పైథాన్‌ను ముంబై రెస్క్యూ టీం రక్షించింది. ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా. పైథాన్‌ను బటయటకు తీసేందుకు కారు టైర్‌ను తొలగించాల్సి వచ్చింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి, వాహనాల్లోకి చొరబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.. అని నందా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు వివరించారు. పోస్ట్ చేసిన వెంటనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెస్క్యూ టీం పామును రక్షించి అటవీ శాఖకు అప్పగించారు. వాళ్లు దానిని థానే జిల్లాలోని ఒక అడవిలో వదిలేశారు.


Tags

Read MoreRead Less
Next Story