Swami Sivananda : వయసు 125 ఏళ్ళు... ఆయిల్ లేని ఫుడ్.. శివానంద దీర్ఘాయువు ర‌హ‌స్యాలివే

Swami Sivananda : వయసు 125 ఏళ్ళు... ఆయిల్ లేని ఫుడ్.. శివానంద దీర్ఘాయువు ర‌హ‌స్యాలివే
Swami Sivananda : యోగాగురువు స్వామి శివానంద సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లోకి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.

Swami Sivananda : యోగాగురువు స్వామి శివానంద సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లోకి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.. దర్బార్‌ హాల్‌లో ఆయన పేరు పిలవగానే లేచొచ్చి, మొదట ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌కు రెండుసార్లు పాదాభివందనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 125 ఏళ్ళ వయసున్న స్వామి శివానంద ఇప్పటికి ఫిట్ గానే ఉన్నారు. ఆయన ఇంత ఫిట్‌‌గా ఉండడానికి గల కారణాలు ఏంటి?

స్వామి శివానంద తన జీవితాన్ని మానవ సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేశారు. 8 ఆగస్టు 1896న జన్మించిన ఆయన ఆరేళ్ల వయసులో తన తల్లిదండ్రులను కోల్పోయారు. తల్లిదండ్రుల అంత్యక్రియలని తిరస్కరించి బ్రహ్మచర్య మార్గాన్ని ఎంచుకున్నాడు. అతని బంధువులు ఆయనను పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లోని గురూజీ ఆశ్రమానికి తీసుకెళ్ళారు. అక్కడ గురు ఓంకారానంద గోస్వామి అతన్ని పెంచారు..

పాఠశాల విద్య, యోగాతో సహా అన్ని ఆచరణాత్మక మరియు ఆధ్యాత్మిక విద్యను అందించారు. స్వామి శివానంద ఉదయం 3 గంటలకే నిద్రలేచి యోగా చేయడం అలవాటు. ప్రపంచమే నా ఇల్లు, దాని ప్రజలే నా తండ్రులు, వారిని ప్రేమించడం, వారికి సేవ చేయడమే నా మతం అని బలంగా నమ్ముతారు. మానవ సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన గత 50 సంవత్సరాలుగా పూరీలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నాడు.

స్వామి శివానంద ఎప్పుడూ నూనె, మసాలాలు లేని చాలా సులభమైన ఆహారాన్ని తీసుకుంటారు. పాలు లేదా పండ్లు తీసుకోవడం కూడా మానేశారు. స్వామి శివానంద 2019లో బెంగళూరులో యోగారత్న అవార్డుతో సహా పలు అవార్డులను అందుకున్నారు. స్వామి శివానంద ఆరోగ్య‌క‌ర‌మైన సుదీర్ఘ జీవితంపై అంత‌ర్జాతీయ మీడియా సంస్ధలు దృష్టిసారించాయి.

Tags

Read MoreRead Less
Next Story